Ibrahimpatnam Former MLA Passed Away: ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కన్నుమూత

Ibrahimpatnam Former MLA Passed Away: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు మస్కు నర్సింహ్మా కన్నుమూశారు. గత కొద్దిరోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నఆయనను ఐదు రోజుల క్రితం చికిత్స నిమిత్తం నిమ్స్ లో చేరారు

Karampoori Rajesh
Published on: 27 July 2020 11:11 AM IST
Ibrahimpatnam Former MLA Passed Away: ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కన్నుమూత
X
ibrahimpatnam former mla narasimh passed away

Ibrahimpatnam Former MLA Passed Away: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు మస్కు నర్సింహ్మా కన్నుమూశారు. గత కొద్దిరోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నఆయనను ఐదు రోజుల క్రితం చికిత్స నిమిత్తం నిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతున్న నర్సింహ్మ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 2004లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి ప్రజల మన్ననలు పొందారు.

నర్సింహ్మా మృతి వార్త విని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నర్సింహా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. 1994లో జరిగిన ఎంపిటిసిగా చింతుల్ల ఎన్నికల్లో సిపిఎం పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. 2000 సంవత్సరంలో జరిగిన జడ్పీటిసి ఎన్నికలో యాచారం మండలం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ముస్సు నర్సింహ్మ ప్రస్తుతం వ్యవసాయ కార్మిక సంఘలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. కార్మిక వ‌ర్గంలో ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story