తహశీల్దార్ హత్య కేసు ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి

MLA Manchireddy Kishan Reddy
x
MLA Manchireddy Kishan Reddy
Highlights

మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు.

తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ ‌రెడ్డి అనుచరులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు సురేష్ టీఆర్‌ఎస్ కార్యకర్త అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు హల్‌ చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరులే హత్య చేయించారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పందించనున్నారు.

మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. రాజకీయ లబ్ధికే తనపై మల్ రెడ్డి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో మల్ రెడ్డి సోదరులు, బంధువులు ఎన్నో భూములు కబ్జా చేశారని చెప్పారు.తహశీల్దార్ హత్య కేసు నిందితుడు సురేష్ తండ్రి, పెద్దనాన్న నుంచి మల్ రెడ్డి బంధువులు భూములు కొనుగోలు చేశారని తెలిపారు.ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద వున్నాయని చెప్పిన మంచిరెడ్డి..పోలీసు విచారణలో నిజనిజాలు తేలుతాయని మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories