సినిమా తరహాలో దొంగతనాలు..పోలీసులకు చిక్కిన దొంగలు

సినిమా తరహాలో దొంగతనాలు..పోలీసులకు చిక్కిన దొంగలు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Hyderabad Bikes Robbery : కొంత మంది దొంగలు సినిమాలను చూసి ఆ సినిమాల్లో ఏ విధంగా దొంగతనాలు చేస్తున్నారో దాన్నే ఫాలో అవడానికి చూస్తారు.

Hyderabad Bikes Robbery : కొంత మంది దొంగలు సినిమాలను చూసి ఆ సినిమాల్లో ఏ విధంగా దొంగతనాలు చేస్తున్నారో దాన్నే ఫాలో అవడానికి చూస్తారు. అయితే అలా చేసిన వారిలో కొంత మంది సక్సెస్ అయినా కొంత మంది మాత్రం ఫెయిల్ అయిపోతారో. ఇదే తరహాలో ఓ దొంగోడు సినిమా ట్రెండ్ ని ఫాలో అవుదాం అనుకున్నాడు. అచ్చం ఇడియట్ సినిమాలో అలీ ఏ విధంగా బైక్‌లను దొంగిలిస్తూ ఇసుక బస్తాలతో పోలీసులను బురిడీ కొట్టిస్తారో అదే విధంగా ముగ్గురు దొంగలు బైకులను బీదర్‌కు తీసుకెళ్లి విక్రయించాలని ప్లాన్ వేశారు. కానీ అక్కడ అలీ పోలీసులకు చిక్కలేదు కానీ ఇక్కడ ఈ దొంగలు మాత్రం పోలీసుల చేతిలో అడ్డంగా దొరికిపోయాడు.

ఈ సినిమాటిక్ చోరీ గురించి పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే హైదరాబాద్ నగరంలోని దహిల్‌బాగ్ మహబూబ్‌ కాలనీకి చెందిన ఎం.వెంకటేష్‌ ఆసీఫ్‌ నగర్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నాడు. అలా బంకులో పనిచేస్తునే మరో వైపు దొంగతనాలను కూడా చేయడం తన వృత్తిగా పెట్టుకున్నాడు. కాగా అతనికి కొద్దిరోజులు క్రితం బీదర్‌కు చెందిన వసీం అక్రం, సిరాజ్‌ ఖాన్‌లతో ఇతడికి పరిచయం ఏర్పడింది. వారు కూడా దొంగతనాలకు పాల్పడుతుండడంతో ఆ ముగ్గురి స్నేహం బలపడింది. ఆ తరువాత వారు ముగ్గురు కలిసి ఇప్పటి ఎన్నో బైక్ లను చోరీ చేయగా వెంకటేష్ మీద 12కు పైగా బైక్‌ చోరీ కేసులున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు వెంకటేష్ ని అదుపులోకి తసుకుని జైలుకు తరలించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలునుంచి వెంకటేష్‌ బయటికి వచ్చాడు.

జైలుకు వెళ్లొచ్చిన మారని వెంకటేష్ మళ్లీ తన చేతివాటాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. రాత్రి సమయంలో అందరూ పడుకున్న సమయంలో బయటకు వెళ్లి ఇళ్ల ముందు నిలిపి ఉంచిన బైకులకు తన దగ్గరున్న తాళాలను పెట్టి చూస్తాడు. ఆ ప్రయత్నం ఫలిస్తే వెంటనే వెంటనే అతని స్నేహితుల వసీం, సిరాజ్‌లకు సమాచారం ఇస్తాడు. ఇతని కాల్ రాగానే ఆ ఇద్దరు దొంగలు కూడా అక్కడికి చేరుకుని ఆ బైకులను తీసుకెళ్లి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి దాచిపెడతారు. కొద్ది రోజుల తరువాత వాటిని వేరే ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. అదే విధంగా దొంగలించిన బైక్ లను బీదర్ తీసుకెళ్తుండగా పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories