ఆంధ్రా పోలీసుల ఫిర్యాదు... తెలంగాణ కానిస్టేబుళ్ల సస్పెండ్

ఆంధ్రా పోలీసుల ఫిర్యాదు... తెలంగాణ కానిస్టేబుళ్ల సస్పెండ్
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Two Telangana Constables Suspended : తాగుడుకు బానిసలైన ఎంతో మంది మందుబాబులు మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు.

Two Telangana Constables Suspended : తాగుడుకు బానిసలైన ఎంతో మంది మందుబాబులు మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. ఎంతో మంది తాగిన మైకంలో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడి తమ ప్రాణాలను కోల్పోతారు.దీంతో వారి కుంటుంబాలు వీధిన పడాల్సిందే. ఇలాంటి ఎన్నో సంఘటనలను చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో మద్యపాన నిషేధం దిశగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించింది. వైన్ షాపులను కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుపుతుంది. అయినా మందుబాబుల సంఖ్య తగ్గకపోవడంతో క్రమంగా మద్యం దుకాణాలను కూడా తగ్గిస్తూ వస్తుంది. ఇలా తగ్గిస్తూ ఏదో ఒక రోజు మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలనేది జగన్ సర్కారు ఆలోచిస్తుంది. కానీ కొంత మంది మద్యం ప్రియులు బెల్టు షాపులు మూతపడడంతో మద్యం దొరకక శానిటైజర్లను తాగి వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతే కానీ వారి ప్రాణాల మీదికి తీసుకువచ్చే తాగుడు అలవాటును మాత్రం మానడం లేదు.

అయితే కొంత మంది మద్యం ప్రియులు ఏపీ, తెలంగాణ మధ్య సుదీర్ఘ సరిహద్దు ఉన్నా వాటిని ఖాతరు చేయకుండా సరిహద్దు దాటొచ్చి తెలంగాణ పల్లెల్లో లిక్కర్ తాగుతున్నారు. అంతే కాక మరికొంత మంద మందుబాబుల అవసరాలను ఆసరాగా తీసుకుని దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఏపీలోకి కొందరు తెలంగాణ నుంచి గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలిస్తున్నారు. ముఖ్యంగా పాత ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి అక్రమంగా తెలంగాణ మద్యం ఏపీలోకి తీసుకెళ్తున్నారు. ఇక సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి కృష్ణా నది మీదుగా అక్రమ మద్యం తరలిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీలో అక్రమ మద్యం భారీ ఎత్తున పట్టుబడింది.

ఈ క్రమంలోనే ఇద్దరు తెలంగాణ పోలీసులు అక్రమ మద్యం తరలిస్తూ ఏపీ పోలీసుల చేతికి చిక్కి తమ ఉద్యోగాను పోగొట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న ఈ ఇద్దరు కానిస్టేబుల్లు ఏపీకి అక్రమంగా మద్యం రవాణా చేసే ముఠాతో చేతులు కలిపారు. వారితో పాటు వీరిద్దరు కూడా మద్యం సరఫరా చేయడం ప్రారంభించారు. అది గమనించిన ఆంధ్రా పోలీసులు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నత అధికారలు ఫిర్యాదును తీసుకుని ఆ కేసును విచారించి అక్రమాలకు పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ భాస్కరన్ సస్పెండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories