ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ

admin1
Updated on: 12 Nov 2019 12:12 PM IST
ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ
X

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై.. హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి రాదని నిన్నటి విచారణలో తేల్చిచెప్పిన హైకోర్ట్.. సమ్మె చట్ట విరుద్ధమని తాము ప్రకటించలేమని స్పష్టం చేసింది. సమ్మెపై ఎస్మా ప్రయోగించాలన్న పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం.. సమస్యను పరిష్కరించాలని గతంలో తాము చాలాసార్లు చెప్పామంటూ గుర్తు చేసింది. చట్ట పరిధిలోని అంశాల ఆధారంగానే విచారిస్తామని.. వివరించింది. ఇవాళ ఈ రెండు పిటిషన్లపై విచారణ జరగనుంది.

admin1

admin1

Next Story