హైదరాబాద్‌లో భారీ వర్షం

Raj
By Raj
Published on: 18 Jun 2020 9:45 PM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం
X

కొద్దిరోజులుగా నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పగలంతా ఆకాశం మేఘావృతం అయి సాయంత్రానికి వర్షం పడుతోంది. గురువారం హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా ఖైరతాబాద్‌, బేగంపేట, హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట్‌, సరూర్‌నగర్‌, మీర్‌పేట్‌, ఎల్బీ నగర్‌, కోఠి ప్రాంతాల తోపాటు పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా కొన్ని చోట్ల రోడ్లు జలమయంగా మారడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.


Raj

Raj

Next Story