Free Rice Distribution Demand: మరో 3 నెలలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలి..రాష్ట్రాల నుంచి డిమాండ్‌..

Free Rice Distribution Demand: మరో 3 నెలలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలి..రాష్ట్రాల నుంచి డిమాండ్‌..
x
Highlights

Free Rice Distribution Demand: ఫ్రీ కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా జీవనోపాధిని కోల్పోయిన ఎంతో మంది పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంది.

Free Rice Distribution Demand: ఫ్రీ కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా జీవనోపాధిని కోల్పోయిన ఎంతో మంది పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంది. అంతే కాదు వారికి ఊరటనిచ్చేలా కేంద్రం ఏప్రిల్‌ నుంచి మూడు నెలల పాటు 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు చొప్పున ఉచితంగా పంపిణీ కూడా చేసింది. ఇప్పుడు ఈ ఉచిత బియ్యం పంపిణీ గడువు జూన్‌తో ముగియనుంది. కాగా మరో మూడు నెలలపాటు ఇదే విధంగా పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో పంపిణీ చేసినట్టే మరో మూడు నెలలు ఉచిత బియ్యం, ఇతర ఆహార ధాన్యాలు సరఫరా చేయాలనే ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ రాష్ట్రాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయగా, తుది నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది.

ఇక రాష్ట్రాలకు మరో మూడు నెలలు ఉచిత బియ్యం, కందిపప్పు గడువును పొడిగించాలని ఇప్పటికే అస్సోం, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్తాన్, పంజాబ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు పంపిణీని మరో మూడు నెలలు పొడిగించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశాయి. ఇక అన్ని రాష్ట్రాలకు మరో మూడు నెలల పాటు ఉచిత రాషన్ ను పంపిణీ చేయాలంటే కేంద్రంపై రూ.46 వేల కోట్ల భారం పడుతుంది. జూలై నుంచి పంపిణీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసినా, పేదలకు సరైన ఉపాధి, ఆదాయ మార్గాలు లేవు. కరోనా కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోళన నెలకొంది. ఇక ఈ విషయంపై ప్రధాని నరేంద్రం మోది నుంచి తుది నిర్ణయం రావాల్సి ఉందని కేంద్ర మంత్రి పాశ్వాన్‌ తెలిపారు.

సీఎంతో చర్చించాక నిర్ణయం..

ఇక పోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఉచిత బియ్యం కోసం ఎలాంటి వినీ చేయలేదు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి, ఆయన సూచన మేరకే కేంద్రానికి లేఖ రాయాలా, వద్దా? అనేది నిర్ణయిస్తామని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక రాష్ట్రంలో 2.80 కోట్ల మంది లబ్ధిదారులకుగానూ కేంద్రం 1.91 కోట్ల మందికి మాత్రమే బియ్యం ఇస్తుండటంతో మిగతా భారం రాష్ట్రం భరించాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories