Unlock 2.0 Guidelines: అన్ లాక్ 2.0 నిబంధనలు విడుదల చేసిన కేంద్రం!

Unlock 2.0 Guidelines: అన్ లాక్ 2.0 నిబంధనలు విడుదల చేసిన కేంద్రం!
x
Highlights

Unlock 2.0 Guidelines:రేపటితో దేశవ్యాప్తంగా అన్ లాక్ 1.0 ముగుస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 2.0 గైడ్ లైన్స్ ని సోమవారం విడుదల చేసింది. కంటైన్మేంట్ జోన్లలో జులై 31 వరకు లాక్ డౌన్ ని పొడిగించింది.

Unlock 2.0 Guidelines: రేపటితో దేశవ్యాప్తంగా అన్ లాక్ 1.0 ముగుస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 2.0 గైడ్ లైన్స్ ని సోమవారం విడుదల చేసింది. కంటైన్మేంట్ జోన్లలో జులై 31 వరకు లాక్ డౌన్ ని పొడిగించింది. ఇక కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అలాగే, హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

ఇక దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్ లు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ , జిమ్ లు, స్విమ్మింగ్ ఫూల్స్, సినిమా హాళ్ళు, మెట్రో రైళ్ళ పై నిషేధాన్ని జులై 31 వరకు పొడిగించింది. అటు దేశమంతటా కర్ఫ్యూ రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇక అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,459 కేసులు నమోదు కాగా, 380 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం 5,48,318 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,10,120 ఉండగా, 3,21,722 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 16,475 మంది కరోనా వ్యాధితో మరణించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories