బయోమెట్రిక్‌ లేకుండా రేషన్‌ : హై కోర్టు ఆదేశాలు

బయోమెట్రిక్‌ లేకుండా రేషన్‌ : హై కోర్టు ఆదేశాలు
x
Highlights

రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆహార భద్రత కార్డు ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా 12 కిలోల బియ్యం, నిత్యావసరాలను ఇస్తున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆహార భద్రత కార్డు ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా 12 కిలోల బియ్యం, నిత్యావసరాలను ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కార్డు లేకుండా ఎన్నో నిరుపేద కుటుంబాలు ఉండడంతో హై కోర్టు ఓ నిర్ణయానికొచ్చింది. బీపీఎల్ కుటుంబాలకు బయోమెట్రిక్‌తో సంబంధం లేకుండా నిత్యవాసరాలు పంపినీ చేయాలని హైకోర్టు పౌరసరఫరాలశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ర్టాల వలస కూలీలతోపాటు రేషన్‌కార్డు రద్దయినవారికి కూడా బియ్యం ఇవ్వాలని పేర్కొన్నది.

ఎస్‌క్యూ మసూద్‌ హైకోర్టులో అధికసంఖ్యలో రేషన్ కార్డులను అధికారులు తొలగించారని, కార్డు లేనందున అందజేతకు నిరాకరిస్తున్నారని దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ రాంచంద్రరావు, జస్టిస్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. కాగా రాష్ట్రంలో ఏ ఒక్క రాషన్ కార్డు తొలగించలేదని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు కూడా రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకు ఇచ్చినట్టుగా బియ్యం, నగదు, నిత్యావసరాలు ఇస్తున్నామని తెలిపారు.

రేషన్‌ తీసుకోనివారికి రూ.1500 చెల్లించడంలేదని దాఖలైన మరో పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. జీవోనంబర్‌ 45 ప్రకారం రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ రూ.1500 చెల్లించాలని హైకోర్టు తెలిపింది. ఈ అంశంపై పూర్తి వివరాలు అందజేస్తామని అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. కాగా ఈ రెండు పిటిషన్లను వచ్చేనెల రెండోతేదీకి వాయిదా వేసినట్లు ధర్మాసనం తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories