Fire Accident: ఉప్ప‌ల్‌లో ఘోర ప్రమాదం.. ఇద్ద‌రి స‌జీవ ద‌హ‌నం

Fire Accident in Uppal Hyderabad
x

ఉప్పల్ లో కాలిపోయిన కంటైనర్ 

Highlights

Fire Accident: హైదరాబాద్ నగర శివారులోని ఉప్ప‌ల్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది.

Fire Accident: హైదరాబాద్ నగర శివారులోని ఉప్ప‌ల్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌కు చెందిన కంటైనర్ డ్రైవర్ షహజాజ్(38), హైదరాబాద్ వాసి, లోకల్ గైడ్‌ గంగా సాగర్(50) శంషాబాద్ నుంచి ఉప్పల్ ఐడీఏకు కార్ల కంటైనర్‌తో బయల్దేరారు. ఆ స‌మ‌యంలో మాడ్రన్ బెడ్ ప్రాంతంతో వారి కంటైన‌ర్‌ క‌రెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్తు తీగలు కంటైనర్‌పై పడ్డాయి.

దీంతో అందులో మంటలు వ్యాపించి, ఇద్దరూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఆ కంటైనర్‌లోని కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు అక్క‌డకు చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ వైర్లు కంటైనర్‌కి ఎలా తగిలాయనే విషయమై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories