Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. రవి ఫుడ్స్ బిస్కెట్ కంపెనీలో చెలరేగిన మంటలు

Hyderabad: 5 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

Jyothi
Updated on: 28 March 2024 9:00 AM IST
Fire accident in Kattedan biscuit factory
X

Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. రవి ఫుడ్స్ బిస్కెట్ కంపెనీలో చెలరేగిన మంటలు

Hyderabad: శంషాబాద్‌ పరిధిలోని కాటేదాన్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రవి ఫుడ్ బిస్కెట్ కంపెనీలో తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. బిస్కెట్ తయారీ అనంతరం బయటికి వచ్చే కన్వేయర్ బెల్ట్ మొదటి అంతస్తు వద్ద మొదట మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కంపెనీలోని మెషినరీ, బిస్కెట్ తయారీ ముడిసరుకు మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. కోట్ల రూపాయల్లో నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు.

ప్రమాద సమయంలో బిస్కెట్ కంపెనీలో సుమారు 60 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇక కంపెనీలో చెలరేగిన మంటలు కాస్త బయటికి వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.

Jyothi

Jyothi

Next Story