Fire Accident: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

Fire Accident: హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ అవంతి నగర్‌లో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.

Arun Chilukuri
Updated on: 17 May 2021 8:00 AM IST
Fire Accident in Hyderabad Avanti Nagar
X

Representational image

Fire Accident: హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ అవంతి నగర్‌లో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందారు. అవంతి నగర్ లో తెల్లవారుజామున ఓ ఇంట్లో షాట్ సర్క్యూట్ రావడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిద్రిస్తున్న వేల ఈ సంఘటన జరగడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకు పోయారు. మంటల్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికులు చూసి 100కి కాల్ చేయగా నారాయణగూడ పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఊపిరాడక గౌరీనాథ్‌ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఐదుగురిని పోలీసులు రక్షించారు. షార్ట్ సర్క్యుట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story