Hyderabad: అంకుర ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం

Hyderabad: అంకుర ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం

Arun Chilukuri
Updated on: 23 Dec 2023 6:34 PM IST
Fire Accident in Ankura Hospital
X

Hyderabad: అంకుర ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం

Ankura Hospital: హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆస్పత్రితో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఆగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఆసుపత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆరు అంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story