ఫీడ్ ద నీడీ సంస్థ ఆధ్వర్యంలో లాస్ట్ రైడ్ సర్వీసులు ప్రారంభం !

ఫీడ్ ద నీడీ సంస్థ ఆధ్వర్యంలో లాస్ట్ రైడ్ సర్వీసులు ప్రారంభం !
x
Highlights

కరోనా భయం.. మనుషులను దూరం చేస్తోంది. మానవత్వాన్నీ హరించేస్తోంది. వైరస్ సోకిన నాటినుంచి మృతుల అంత్యక్రియల వరకు ప్రవర్తిస్తున్న తీరు ఆదోళన కలిగిస్తోంది....

కరోనా భయం.. మనుషులను దూరం చేస్తోంది. మానవత్వాన్నీ హరించేస్తోంది. వైరస్ సోకిన నాటినుంచి మృతుల అంత్యక్రియల వరకు ప్రవర్తిస్తున్న తీరు ఆదోళన కలిగిస్తోంది. వైరస్ సోకినవారు అనారోగ్యంతో బాధపడుతుంటే సమాజం ప్రవర్తిస్తున్న తీరుతో మరింత కృంగిపోతున్నారు. కరోనా లక్షణాలతో చనిపోయినా మృతదేహాలను ముట్టుకునేందుకు కుటుంబసభ్యులు సైతం ముందుకురావడం లేదు. మృతదేహాన్ని స్మశానానికి తరలించే నలుగురు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఫీడ్‌ ది నీడ్ టీమ్‌ ప్రతినిధులు ముందు కు వచ్చి కరోనా మృతులు కోసం లాస్ట్ రైడ్ పేరుతో వాహనాన్ని అందిస్తున్నారు.

కరోనా మనుషులనే కాదు మానవత్వాన్నీ చంపేస్తోంది. కొవిడ్‌ బారినపడిన చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కరోనాతో మృతిచెందిన వారిని ఖననం చేయడం సమస్యగా మారింది. దీంతో ఫీడ్‌ ది నీడీ టీమ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహించడానికి అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. కరోనా బారినపడి చనిపోయిన వారిని శ్మశానవాటికకు చేర్చేందుకు ఫీడ్‌ ద నీడీ సంస్థ మొదలుపెట్టిన లాస్ట్‌ రైడ్‌ సర్వీస్‌ను రాచకొండ సి.పి. మహేష్‌ భగ్వత్‌ శనివారం ప్రారంభించారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తరలించాలనుకునే వారు 7995404040 కు ఫోన్‌ చేయాలని అన్నారు.

రాచకొండ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ కి కూడా సమాచారం ఇవ్వొచ్చని, మీకు వాహనం అవసరం అనుకుంటే 9490617234 కి సమాచారం ఇవ్వాలని సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కృష్ణ తెలిపారు. మరోవైపు కరోనా మృత దేహాల అంత్యక్రియలని అడ్డుకోవదని పలువురు సూచిస్తున్నారు. శవం పై కరోనా మహమ్మారి ఎక్కువ సేపు ఉండదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories