Top
logo

Metro MD NVS Reddy announces guidelines : హైదరాబాద్ మెట్రో పున:ప్రారంభం..మార్గదర్శకాలు ప్రకటించిన ఎన్వీఎస్ రెడ్డి

Metro MD NVS Reddy announces guidelines : హైదరాబాద్ మెట్రో పున:ప్రారంభం..మార్గదర్శకాలు ప్రకటించిన ఎన్వీఎస్ రెడ్డి
X
Highlights

Metro MD NVS Reddy announces guidelines : కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించిన విషయం తెలిసిందే.

Metro MD NVS Reddy announces guidelines : కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించిన విషయం తెలిసిందే. అదే విధంగా మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. అయితే దశలవారీగా లాక్ డౌన్ సడలింపులు చేయడంతో స్థంబించిన రవాణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈ నెల ఏడు నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్‌ వీ ఎస్‌ రెడ్డి ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ అన్ లాక్ 4 కు అనుగుణంగా ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు పున: ప్రారంభం కానున్నాయని తెలిపారు.

ప్రయాణికుల పట్ల అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నారు. ప్రయాణికులు ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి పాటించాలని అన్నారు. మార్కింగ్ కు తగ్గట్టుగా ప్రయాణీకులు ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నారు. నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తామని తెలిపారు. నగదు రహిత రూపంలో ఆన్ లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ యూజ్ చేయాలన్నారు. ప్రతి 5 నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుందని అన్నారు. రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ప్రయాణికులు తప్పని సరిగా ఫేస్ మాస్క్ ధరించాలని, లేనివారు స్టేషన్ లో కొనుక్కోవాలని సూచించారు.

ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తామన్నారు. నార్మల్ టెంపరేచర్ ఉంటేనే అనుమతి ఉంటుందన్నారు. ప్రతి స్టేషన్ లో హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు. మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్ తో రావాలన్నారు. 75% ఫ్రెష్ ఎయిర్ ట్రైన్ లో అందుబాటులో ఉంటుంది. అక్కడక్కడ టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతామని తెలిపారు. ప్రతి స్టేషన్ లో ఐసోలేషన్ రూంల ఏర్పాటు చేసామని తెలిపారు. మొదటి వారంలో రోజుకు 15 వేల మంది ప్రయాణీకులు వస్తారని అంచనా వేస్తున్నాం. ప్రతి స్టేషన్‌లో మెట్రో రైల్ 30-50 సెకన్లు ఆగుతుంది' అని తెలిపారు.

Web TitleDuring the Metro restart hyderabad metro md nvs reddy announces new guidelines
Next Story