తెలంగాణలో కొత్తగా 2,511 కరోనా పాజిటివ్ కేసులు

X
Highlights
Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. ...
Arun Chilukuri5 Sep 2020 4:29 AM GMT
Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,511 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,38,395కి చేరింది. మృతుల సంఖ్య 877 కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 2,579 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,04,603కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీరిలో 25,729 మంది హోం క్వారంటైన్, హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపింది. ఇక, మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.73 శాతంగా ఉంటే తెలంగాణలో 0.63 శాతంగా ఉందని, కోలుకున్నవారి సంఖ్య 75.5 శాతానికి పెరిగిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Web TitleCoronavirus Updates in Telangana: 2,511 new coronavirus cases reported in Telangana
Next Story