Dog Locked Door From Inside: గదిలో దూరి గడియ పెట్టుకున్న శునకం

Dog Locked Door From Inside: సంగారెడ్డి జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ శునకం ఓ గదిలోకి వెళ్లి దానంతట అదే గడియ పెట్టుకుంది

Sumitra
Published on: 4 Aug 2020 2:40 PM IST
Dog Locked Door From Inside: గదిలో దూరి గడియ పెట్టుకున్న శునకం
X

Dog Loked Door From Inside: సంగారెడ్డి జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ శునకం ఓ గదిలోకి వెళ్లి దానంతట అదే గడియ పెట్టుకుంది. ఏంటి వింటుంటే నమ్మశక్యంగా లేదా కదా..? కానీ అది నిజం. ముందు అక్కడ ఉన్న వారు కూడా ఎవరో గుర్తుతెలియన వ్యక్తలు ఇలా లోపల దాక్కుని గడియ పెట్టుకున్నారనుకున్నారు అక్కడి గ్రామస్థులు. కానీ తీరా చూస్తూ అది ఓ శునకం అని తేలింది. నారాయణ్‌ఖేడ్ మండలంలో చోటు చేసుకున్న ఈ వింత ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుర్కపల్లి తండా శివారులో వైకుంఠదామం నిర్మిస్తున్నారు. ఆ వైకుంఠదామంలో ఓ గదిని కూడా నిర్మించారు. అయితే ఆ గదిలోకి వెళ్లిన ఓ శునకం లోపలి నుంచి గడియ పెట్టుకుని లోపలే ఉంది. అయితే మరుసటి రోజు ఉదయాన్నే ఆ గదికి పెయింటింగ్ వేయడానికి కొంత మంది కూలీలు అక్కడికి చేరుకున్నారు. వారిలో పనిలో భాగంగా గది తలుపులను తెరవబోయారు.

కానీ ఆ గది తలుపు తెరచుకోకుండా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులా, లేక తాగిన మైకంలో ఉన్న వారు లోపల గడియ పెట్టుకున్నారేమో అని భావించారు. ఆ తరవాత గది లోపల ఎవరున్నారో తెలుసుకోవడానికి చిన్నపాటి నిచ్చెనల వేసుకొని కిటికీలో నుంచి చూసారు. కానీ ఆ గదిలొ ఎవరూ ఎవరూ కనిపించలేదు. సరే మరోసారి జాగ్రత్తగా చూద్దాం అని మళ్లీ నిచ్చెన ఎక్కి చూసారు అప్పుడు కనిపించింది వారికి ఓ కుక్క తోక ఊపుతూ. దాన్ని గమనించిన కూలీలు ఒక్కసారిగా షాకై సమీపంలో ఉన్న ఓ పొడవైన కర్ర సాయంతో తలుపు గడియను తీశారు. వీళ్లు తలుపు తీశారో లేదో.. ఆ శునకం ఆ గదిలో నుంచి పరారైంది. ఆ శునకం తెలివి చూసి స్థానికులు అవాకయ్యారు.

Sumitra

Sumitra

Next Story