Top
logo

వినియోగదారుల గూబ గుయ్యమనిపిస్తున్న కరెంట్ బిల్లులు

వినియోగదారుల గూబ గుయ్యమనిపిస్తున్న కరెంట్ బిల్లులువినియోగదారుల గూబ గుయ్యమనిపిస్తున్న కరెంట్ బిల్లులు
Highlights

సంగారెడ్డి జిల్లాలో విద్యుత్ బిల్లులు వినియోగదారుల గూబ గుయ్యమనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనవిధంగా అధిక...

సంగారెడ్డి జిల్లాలో విద్యుత్ బిల్లులు వినియోగదారుల గూబ గుయ్యమనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనవిధంగా అధిక బిల్లులు వస్తుండటంతో ప్రజలు షాక్ తింటున్నారు. అధికారులను సంప్రదించినా పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో షాకిస్తోన్న కరెంట్ బిల్లులపై hmtv ప్రత్యేక కథనం.

సంగారెడ్డి జిల్లాలో అధిక కరెంట్ బిల్లులు ప్రజలను భయపెడుతున్నాయి. నిన్నమొన్నటివరకు వంద రూపాయల నుంచి ఐదొందల్లోపు వచ్చే బిల్లులు, ఒక్కసారిగా వేలల్లో వస్తున్నాయని లబోదిబోమంటున్నారు. అయితే, అధిక బిల్లులపై ఫిర్యాదులు చేస్తున్నా, విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో, వినియోగదారులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

సంగారెడ్డి ప్రశాంత్‌నగర్‌ కాలనీలో నివాసముండే నాగేందర్ 2003 నుంచి ఒక దుకాణం నిర్వహిస్తున్నాడు. అప్పట్నుంచి, 2018 జూన్ వరకు నెలకు 150 నుంచి 400 రూపాయల వరకు కరెంట్ బిల్లు వచ్చేది. అయితే, 2018 జూన్‌లో కొత్త మీటరు తీసుకున్నారు. ఇక, అప్పట్నుంచి కరెంట్ బిల్లు మోత మొదలైంది. కొత్త మీటరు తీసుకున్న తర్వాతి నెలలోనే 1433 రూపాయిల బిల్లు వచ్చింది. దాంతో, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, విద్యుత్ అధికారుల నుంచి సమాధానం రాకపోవడంతో, లాయర్ ద్వారా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. దాంతో, ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా రీడింగ్ తీయడం కారణంగా పొరపాటు జరిగిందని, అందుకే బిల్లు ఎక్కువగా వచ్చిందంటూ విద్యుత్ శాఖ అధికారులు ఫోరమ్‌‌కు తెలియజేశారు. అయితే, ఆ సమాచారాన్ని వినియోగదారునికి ఇవ్వలేదని గుర్తించిన వినియోగదారుల ఫోరమ్ బాధితుడు నాగేందర్‌కు 30 రోజుల్లోగా, 15వేల రూపాయల పరిహారం అందజేయాలంటూ విద్యుత్ అధికారులను ఆదేశించింది.

ఒక్క నాగేందర్‌కే కాదు, సంగారెడ్డి జిల్లాలో ఎంతో మంది, అధిక విద్యుత్‌ బిల్లులతో సతమతమవుతున్నారు. ఇంతకుముందు, 5వందలు కూడా దాటని కరెంట్ బిల్లులు వేలల్లో వస్తున్నాయని వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందంటున్న విద్యుత్ వినియోగదారులు, అధిక బిల్లులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.Web TitleHmtv special report on current bills in the Sangareddy Telangana
Next Story