Tammineni Veerabhadram Comments On Cm KCR : కేసీఆర్ ఉద్యమాలకు సిద్ధం కావాలి : తమ్మినేని వీరభద్రం

Tammineni Veerabhadram Comments On Cm KCR : కేసీఆర్ ఉద్యమాలకు సిద్ధం కావాలి : తమ్మినేని వీరభద్రం
x

Tammineni Veerabhadram


Highlights

Tammineni Veerabhadram Comments On Cm KCR : కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల కోసం రాష్ట్రప్రభుత్వం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి...

Tammineni Veerabhadram Comments On Cm KCR : కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల కోసం రాష్ట్రప్రభుత్వం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో ఉపేక్షించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిధుల విషయంలో కేంద్రపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఉద్యమిస్తే ఆయనకు తాము బాసటగా నిలుస్తామని మద్దతు పలికారు. రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలపై ఆయన ప్రశంస వర్షం కురిపించారు. రాష్ట్రాలకు సమకూర్చాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం అప్పులు తీసుకోవాలని చెబుతుండడం దారుణమని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

జీఎస్టీ వల్ల రాష్ట్రం రూ.వేల కోట్లు నష్టపోయిందని ఆయన వివరించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ నుంచి సామాన్యులను మినహాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే బీజేపీ ప్రయత్నాలను ఎండగట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు పోరాటంలో భాగస్వాములు కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఆమోదం పొందిన కొత్త రెవెన్యూ చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను సవరించాలని ఆయన సూచించారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఇతర నేతలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఉద్యమ సమయంలో దిల్లీలో చెలరేగిన ఘర్షణలకు సంబంధించిన నిందితులంటూ పోలీసులు కేసులు నమోదు చేయడం వెనుక బీజేపీ కుట్రలు ఉందని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. వారిపై వేసిన నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories