KCR Warns Centre Conspires : కేంద్రం తెచ్చే చట్టాన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి : సీఎం కేసీఆర్

KCR Warns Centre Conspires : కేంద్రం తెచ్చే చట్టాన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి : సీఎం కేసీఆర్
x
Highlights

KCR Warns Centre Conspires : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం ఎంతో ప్రమాదమని మంగళవారం అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ అన్నారు. ...

KCR Warns Centre Conspires : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం ఎంతో ప్రమాదమని మంగళవారం అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ రంగంతో సహా అన్ని ప్రభుత్వ రంగాలను మూసివేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలికంగా జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని ప‌రిపాలించే విధానంలో.. అంబేడ్కర్, ఇత‌ర గొప్ప వ్యక్తులు ప్రవేశ‌పెట్టిన ఆదేశిక సూత్రాల‌ను ఉల్లంఘిస్తున్నారు. కేంద్రం తెచ్చే చట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని సీఎం అన్నారు. కొత్త చ‌ట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకు మీట‌రు పెట్టాల్సి వ‌స్తుంద‌ని కేసీఆర్ అన్నారు. కొత్త చట్టం ప్రకారం మీటర్లను అమరిస్తే వాటికే రూ.700 కోట్ల నిధులు కావాలని ఆయన అన్నారు. మీట‌ర్ రీడింగ్ తీస్తారు. బిల్లులు ముక్కు పిండి వ‌సూలు చేస్తారు అని ఆయన అన్నారు. కొత్తగా ప్రవేశ పెట్టే చట్టానికి సంబంధించి న‌మూనా బిల్లు కూడా పంపించారని, ఆ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని ఆయన అన్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు ఉన్న అధికారాలు పూర్తిగా ఢిల్లీకి వెళ్తాయని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఎవ‌రున్నా రాష్ర్టాల హ‌క్కులను హ‌రిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తాను కేంద్రానికి లేఖ కూడా రాసినట్లు గుర్తు చేశారు.

కేంద్ర విద్యుత్ చ‌ట్టం వ‌స్తే ఈఆర్సీ నియామ‌కాలు త‌మ చేతిలో ఉండ‌వ‌ని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యుత్ చ‌ట్టం వ‌స్తే ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలు వ‌స్తాయన్నారు. విద్యుత్ రంగం ప్రభుత్వం వ‌ద్ద ఉంటే డిస్కంలు, ట్రాన్స్ కో, జెన్ కో అభివృద్ధి చెందుతాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం వ‌ద్ద ఉన్న అధికారాన్ని ప్రైవేటు కంపెనీల‌కు అప్పగిస్తారన్నారు. రాష్ర్టంలోని 26 ల‌క్షల బోర్లకు మీట‌ర్లు పెట్టేందుకు రాష్ర్ట బీజేపీ నేత‌లు ఒప్పుకుంటారా? కేంద్రం తెచ్చే చ‌ట్టాన్ని అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయని ఆయన అన్నారు. నా చిన్నప్పుడు బిల్లు క‌లెక్టర్‌ను చూస్తే రైతులు ఎంతో భ‌య‌ప‌డేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రజలు, రైతులపై పెనుభారం మోపే విధంగా ఉన్న విద్యుత్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి'' అని సీఎం అన్నారు. విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ నుంచి ఎన్నికైన నలుగురు బిజెపి ఎంపిలను సిఎం కోరారు. మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని కెసిఆర్ ఆరోపించారు. ఈ మేరకు కేసీఆర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. బిల్లు ఉపసంహరణ తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories