తెలంగాణ అసెంబ్లీలో మూగబోయిన బీజేపీ గొంతు

తెలంగాణ అసెంబ్లీలో మూగబోయిన బీజేపీ గొంతు
x
Highlights

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ గొంతు మూగబోయింది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సుమారు వారం రోజులు గడుతున్నా ఆపార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్...

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ గొంతు మూగబోయింది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సుమారు వారం రోజులు గడుతున్నా ఆపార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పర్ఫామెన్స్‌ చేయలేక చేతులు ఎత్తేశాడు. ఓవైపు టీఆర్ఎస్‌ కేంద్ర ప్రభుత్వంపై మాటల దాడి చేస్తోంది. మరోవైపు మజ్లీస్‌ కాషాయ పార్టీతో కయ్యానికి కాలుదువ్వుతోంది. అయినా సభలో రాజాసింగ్‌ మౌనం వహిస్తున్నారు. తాజగా కేంద్ర విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మాణం చేసిన రోజు రాజాసింగ్‌ సభకు డుమ్మాకొట్టడం చర్చనీయశమైంది.

తెలంగాణ బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌. అయితే ప్రారంభంలో ఆయన పర్ఫామెన్స్‌ బాగానే ఉన్నా రానురాను ఆయన సైలెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఆయన మౌనం వహించడం సొంతపార్టీ నేతలను నిర్వరపరుస్తోంది. సభలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌తోపాటు మజ్లీస్‌ పార్టీ ఆరోపణలు చేస్తుంటే రాజాసింగ్‌ సైలెంట్‌గా ఉండటంతో పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు.

మంగళవారం శాసన సభలో 2003 కేంద్ర విద్యుత్ సవరణ చట్టం బిల్లును వ్యతిరేకిస్తూ సభ తీర్మాణం చేసింది. సభలో కేంద్ర విద్యుత్ చట్టం పై చర్చ ఉందని తెలిసి కూడ రాజాసింగ్ సభకు డుమ్మాకొట్టడంపై బీజేపీ నేతలు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టంపై కేసీఆర్‌ బీజేపీని సవాల్‌ చేశారు. దీంతో సభలో బీజేపీ ప్రాతినిధ్యం ఉన్నా లేనట్లే అయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రం ప్రవేశపెట్టబోయే కొత్త చట్టం వల్ల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయా? లేక నష్టాలు ఉన్నాయా అని బీజేపీ, కేంద్రాన్ని ప్రశ్నించారు.

సభలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీ నేతలకే కాదు విపక్ష పార్టీలకు కూడా అర్థం కావడం లేదు. టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలు రెచ్చిపోయి మరి బీజేపీపై విమర్శలు, ఆరోపనలు చేస్తున్నా రాజాసింగ్‌ తమ పార్టీని కాదన్నట్లు సెలెంట్‌గా కూర్చిండిపోరాయని సొంత పార్టీ నేతలే విమర్శింస్తున్నారంట. అయితే రాజాసింగ్‌కు సొంత పార్టీ నేతలు సహకరించకపోవడం వల్లే కేంద్ర విద్యుత్‌ బిల్లుపై వ్యతిరేక తీర్మాణం చేసిన మాట్లాడకుండా నిరసన వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. మరి ఎమ్మెల్యే రాజాసింగ్‌ అలకపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories