తెలంగాణలో కరోనా పంజా.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 713 కొత్త కేసులు..

తెలంగాణలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 872 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Samba Siva Rao
Published on: 22 Jun 2020 9:26 PM IST
తెలంగాణలో కరోనా పంజా.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 713 కొత్త కేసులు..
X

తెలంగాణలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 872 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 713 పాజిటివ్ కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8674కి చేరుకున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 4,005 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో4,452 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా భారిన పడి 217మంది మరణించారు. రంగారెడ్డిలో 107, మేడ్చల్‌లో 16, సంగారెడ్డిలో 12, వరంగల్ రూరల్‌లో 6, మంచిర్యాల 5, కామారెడ్డి, మెదక్‌లో 3చొప్పున, జనగాం, కరీంనగర్, మహబూబాబాబ్లో 2 చొప్పున, వరంగల్ అర్బన్లో ఒక్క కేసులు నమోదయ్యాయి.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story