తెలంగాణలో కొత్తగా కరోనా 237 కేసులు.. అందులో 195 అక్కడినుంచే..

Raj
By Raj
Updated on: 14 Jun 2020 9:56 PM IST
తెలంగాణలో కొత్తగా కరోనా 237 కేసులు.. అందులో 195 అక్కడినుంచే..
X
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో తగ్గినట్టే తగ్గి కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ రోజు అధికంగా 237 కేసులు నమోదయ్యాయి. ఇందులో జిహెచ్ఎంసి పరిధిలో రికార్డ్ స్థాయిలో 195 వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4974కి చేరినట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

అలాగే కరోనా భారిన పడి గత 24 గంటల్లో మరో 3 మంది మృతి చెందారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 185కి చేరింది. ఇక ఇప్పటివరకూ 2377 కోలుకొని డిచార్జి అయ్యారు. దాంతో ప్రస్తుతం రాష్ట్రంలో 2412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.




Raj

Raj

Next Story