తెలంగాణలో కరోనా పంజా.. ఇవాళ ఒక్క రోజే 129 పాజిటివ్ కేసులు

Samba Siva Rao
Updated on: 3 Jun 2020 9:20 PM IST
తెలంగాణలో కరోనా పంజా.. ఇవాళ ఒక్క రోజే 129 పాజిటివ్ కేసులు
X
Representational Image

తెలంగాణ లో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతూ తన విశ్వరూపం ప్రదర్శిస్తుంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 129 కేసులు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ పరిధిలో 127 నమోదు కాగా.. ఇద్దరు వలస కూలీలకు కరోనా సోకినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ లో వెల్లడించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 108 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3020కి చేరింది.

గత 24 గంటల్లో మరో ఏడుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 99కి చేరింది. ఇప్పటి వరకు 1556 మంది డిశ్చార్జి అవ్వగా.. 1365 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 108, రంగారెడ్డి 6, అసిఫాబాద్ 6, మేడ్చల్ 2, సిరిసిల్ల 2, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story