తెలుగుజాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం : సీఎం కేసీఆర్

తెలుగుజాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం : సీఎం కేసీఆర్
x
Highlights

CM KCR presented Dasaradhi Award: తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని సీఎం కేసీఆర్ అభినందించారు. మహాకవి దాశరథి...

CM KCR presented Dasaradhi Award: తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని సీఎం కేసీఆర్ అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని సీఎం అభిప్రాయపడ్డారు. మహాకవి దాశరథి పురస్కారం - 2020 ని ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతి భవన్ లో రామానుజంకు అందించారు. శాలువా కప్పి సన్మానించారు. జ్ఞాపిక, రూ.1,01,116 నగదు పురస్కారం అందించారు.

దాశరథి పురస్కారానికి రామానుజం వందకు వంద శాతం అర్హుడని సీఎం అన్నారు. రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని అభినందించారు. రామానుజం మరిన్ని రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు. అవార్డు ప్ర‌దానోత్స‌వ కార్యక్రమంలో ఎంపి కె. కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్ మామిడిహరికృష్ణ, సిఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రామానుజం కుమారుడు శ్రీనివాస్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ పాడి వినిపించిన పద్యం అందరినీ ఆకట్టుకున్నది.




Show Full Article
Print Article
Next Story
More Stories