దిషా హత్యపై సీఎం కేసీఆర్ ఆవేదన

దిషా హత్యపై సీఎం కేసీఆర్ ఆవేదన
x
Highlights

డాక్టర్ దిషా హత్యా ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేసీఆర్

దిషా హత్యా ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేసీఆర్.. దిషా పై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించారు. మానవ మృగాలు మన మద్యే తిరుగుతున్నాయని కలత చెందారు సీఎం కేసీఆర్. దిషా హత్య దారుణమైన, అమానుషమైన దుర్ఘటన అన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దిషా కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే ఇక నుంచి శంషాబాద్ బాధితురాలి పేరును దిషా అనే పేరుతో పిలవాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి పేరును మార్చినట్లు సీపీ వెల్లడించారు. ఇక నుంచి అందరూ జస్టిస్ ఫర్ దిషా పేరుతో పిలవాలని సూచించారు. ఈ పేరు విషయమై సీపీ సజ్జనార్ బాధితురాలి కుటుంబ సభ్యుల అనుమతిని కూడా తీసుకున్నారు. సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో బాధితురాలి పేరును వాడొద్దని, జస్టిస్ ఫర్ దిషాకు అందరూ సహకరించాలని ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. అత్యాచారానికి గురైన బాధితురాలి పేరును, వారి కుటుంబ సభ్యుల పేర్లను, వివరాలను ఎక్కడా ప్రస్తావించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీపీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories