Car Washed Away in Siddipet: సిద్ధిపేట జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు.. గ‌ల్లంతైన వ్య‌క్తి

Car Washed Away in Siddipet: సిద్ధిపేట జిల్లాలో మ‌రో నీటి ప్రమాదం చోటు చేసుకుంది. వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌గా, కారుతో పాటు డ్రైవ‌ర్ గ‌ల్లంతు అయ్యాడు

Karampoori Rajesh
Published on: 17 Aug 2020 2:00 PM IST
Car Washed Away in Siddipet: సిద్ధిపేట జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు.. గ‌ల్లంతైన వ్య‌క్తి
X
Car Washed Away in Siddipet

Car Washed Away in Siddipet: సిద్ధిపేట జిల్లాలో మ‌రో నీటి ప్రమాదం జరిగింది. వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌గా, కారుతో పాటు డ్రైవ‌ర్ గ‌ల్లంతు అయ్యాడు. ఈ ఘ‌ట‌న నంగునూర్ ,చిన్నకోడూర్ మండ‌ల స‌రిహ‌ద్దుల్లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. వివరాల్లోకి వెళ్తే రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండగా సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాగులో పడిపోయారు.

వాహ‌నం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ ముగ్గురు వ్య‌క్తులు ఈదుకుంటూ వెళ్లి వాగు మ‌ధ్య‌లో ఉన్న చెట్టును ఆధారం చేసుకొని స‌హాయం కోసం ఆర్త‌నాదాలు చేశారు. ఈ స‌మాచారం తెలుసుకున్న పోలీసులు, వెంట‌నే ప్ర‌మాద‌స్థలానికి వెళ్లి గ్రామస్తుల సహాయంతో ర‌క్షించారు. కారుతో పాటు మరొకరి ఆచూకీ లభించలేదు. మంత్రి హ‌రీష్‌రావు ఆదేశాలతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి సీపీ జోయల్ డెవిస్ చేరుకొని పరిస్థిని సమీక్షిస్తున్నారు. గ‌ల్లంతైన వ్య‌క్తి శ్రీనివాస్ తెరాస కార్య‌క‌ర్త‌ అని తెలుస్తుంది. సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల‌ని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సిద్ధిపేట ఆర్డీవో ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని గాలింపు చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story