Hyderabad: హైదరాబాద్‌ గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో దారుణం

Hyderabad: కొండాపూర్ శ్రీరామ్‌నగర్‌లో యువతిపై నలుగురు అత్యాచారయత్నం

Rama Rao
Published on: 29 May 2022 5:39 PM IST
Attempt to Molested Young Women in Kondapur
X

Hyderabad: హైదరాబాద్‌ గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో దారుణం

Hyderabad: హైదరాబాద్‌ గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. కొండాపూర్ శ్రీరామ్‌నగర్‌లో యువతిపై నలుగురు యువకులు అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీరామ్‌నగర్‌లో గాయత్రి, శ్రీకాంత్ దంపతులు నివాసముంటున్నారు. అదే కాలనీలో శ్రీకాకుళానికి చెందిన శ్రీ హర్షిత ఉంటోంది. శ్రీహర్షితకు శ్రీకాంత్ తో ఏర్పడిన పరిచయంపై గాయత్రి అనుమానం పెంచుకుంది.

ఈ నెల 26న శ్రీహర్షితను ఇంటికి పిలిపించిన గాయత్రి నలుగురు యువకులతో అత్యాచారయత్నం చేయించింది. బాధితురాలిని నలుగురు అతిదారుణంగా హింసించారు. ఆ దారుణాన్ని మొత్తాన్ని గాయత్రి తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసింది. ఎవరికైనా చెబితే వీడియోని సోషల్‌మీడియాలో పెడతానని బెదిరించింది. ప్రస్తుతం బాధితురాలు ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. గచ్చిబౌలి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Rama Rao

Rama Rao

Next Story