రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్‌నకు యత్నం

admin1
Published on: 25 Nov 2019 8:54 PM IST
రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్‌నకు యత్నం
X

హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. యాదగిరి రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ఇంటి నుంచి బయటకు రాగానే కాలనీ శివారులో 2 కార్లలో ఉన్న కిడ్నాపర్లు ఆయనను బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించారు.

యాదగిరిరెడ్డి గట్టిగా కేకలు పెట్టడంతో ఆయన ఫోన్, కారు తీసుకుని దుండగులు పరారయ్యారు. హుటాహుటిన తన ఇంటికి చేరుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వెనుక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నారంటూ తనను బెదిరించారని బాధితుడు తెలిపాడు. కిడ్నాప్‌ యత్నానికి ఆస్తిలావాదేవీలే కారణమని తెలుస్తోంది.



admin1

admin1

Next Story