Telangana: హైదరాబాద్‌ లో 9 ఏళ్ల బాలిక కిడ్నాప్

Hyderabad: హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌‌మెట్‌ పరిధిలోని తట్టిఅన్నారంలో తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది.

Venkata Chari
Published on: 6 April 2021 10:10 AM IST
9 Years Old Girl Kidnapped in Hyderabad
X

హైదరాబాద్‌ లో 9 ఏళ్ల బాలిక కిడ్నాప్ (represental image)

Hyderabad: హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌‌మెట్‌ పరిధిలోని తట్టిఅన్నారంలో తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. తన కూతురు కన్పించకపోవడంతో కిడ్నాప్‌కు గురైనట్లు తండ్రి ముస్తఫా గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తట్టి అన్నారంలో ఓ షాపు వద్ద సీసీ కెమెరాల్లో బాలికతో ఓ వ్యక్తి ఉండటాన్ని పోలీసులు గమనించారు. సీసీ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్‌లో కన్పించిన వ్యక్తిని బాలిక తండ్రి, బంధువులు గుర్తించారు. సీసీ ఫుటేజ్‌లో కన్పించిన వ్యక్తి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

హైదరాబాదు హయత్ నగర్ లో 9 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. తట్టి అన్నారంలో జరిగిన ఈ ఘటనపై బాలిక తండ్రి ముస్తాఫా హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం మధ్యాహ్నం నుంచి బాలిక కనిపించడం లేదని వెల్లడించాడు.

ఈమేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ బాలికను ఓ షాపు నుంచి గుర్తు తెలియని వ్యక్తి తీసుకుని వెళ్తున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడుని రాజుగా గుర్తించారు పోలీసులు.

బాలిక కోసం 30 మందితో కూడిన పది పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మరోవైపు హయత్ నగర్ లోని జాతీయ రహదారిపై గల సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అతని ఆచూకీ కనిపించలేదు. నిందితుడు నగరం దాటి వెళ్లి ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నిందితుడు రాజు భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక అపహరణకు గల కారణాలు తెలియడం లేదు.

Venkata Chari

Venkata Chari

Next Story