Hyderabad: మియాపూర్‌లో 13 నెలల చిన్నారి అనుమానాస్పద మృతి

* హైదరాబాద్‌ మియాపూర్‌లో దారుణం * ఓంకార్‌నగర్‌లో నిన్న అదృశ్యమైన చిన్నారి * తెల్లవారుజామున ఇంటిముందు చిన్నారి మృతదేహం

Sandeep Reddy
Updated on: 13 Sept 2021 11:39 AM IST
13 Months Old Baby Expired Suspiciously in Miyapur Hyderabad
X

హైదరాబాద్‌ మియాపూర్‌లో దారుణం 

Hyderabad: హైదరాబాద్‌ మియాపూర్‌లో దారుణం జరిగింది. ఓంకార్ నగర్‌లో నిన్న కనిపించకుండా పోయిన 13 నెలల చిన్నారి విగతజీవిగా కనిపించింది. ఇంటి సమీపంలోని నీటి సంపులో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నిన్న ఉదయం పనులకు వెళ్తూ తల్లిదండ్రులు తమ పాపను పక్కింట్లో అప్పగించారు. పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టూ పక్కల అంతా వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి వరకూ ఆడుకుంటూ ఉన్న పసికందు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, పాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ పాప ఆడుకుంటూ వెళ్లి పొరబాటున పడిందా? లేక ఎవరైనా కావాలనే తోసేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story