అబ్బా..ఛా! ప్రమాదంలో యువతి చనిపోతే.. ఈ యువకుడు చేస్తున్న పని చూడండి!

పిచ్చి ముదిరిందనుకోవాలా.. ఈ సంఘటన చూసిన వారికైతే నోటా మాట రాలేదు.. మీరు చూసి డిసైడ్ అయిపోండి!

K V D Varma
Updated on: 26 Nov 2019 6:09 PM IST
అబ్బా..ఛా! ప్రమాదంలో యువతి  చనిపోతే.. ఈ యువకుడు చేస్తున్న పని చూడండి!
X
A person taking selfie at Banjarahills road accident dead body

''ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట ఒకడు'' అని పాత సామెత. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. సెల్ఫీల మోజుతో సమయం..సందర్భం చూడకుండా సెల్ఫీలు తీసుకుంటూ చికాకు తెప్పిస్తున్నారు. తమ సెల్ఫీ స్టుపిడిటీ సిండ్రోమ్ తో నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితి తెస్తున్నారు.

ఈరోజు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఆర్టీసీ బస్సు ఒక టెకీని బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టడం తో ఆమెకు కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో అక్కడ ఆ సమయంలో ఉన్న ప్రజలు కోపోద్రిక్తులు అయ్యారు.

ఇక చనిపోయిన మహిళ మృత దేహం అక్కడ ఉండగానే ఓ యువకుడు తన సెల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకుంటూ కెమెరాలకు చిక్కాడు. అక్కడ అంత దారుణమైన పరిస్థితి లో ఆ యువకుడి పిచ్చి చేష్టకి అక్కడి జనాలకు ఏమనాలో అర్థం కాలేదు. అయితే, ఈ సెల్ఫీ పిచ్చోడు చేసిన పనిని వీడియో తీసిన వారు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో టెకీ మరణం కంటే.. ఈ వీడియో విపరీతంగా ప్రాచుర్యం లోకి వచ్చింది.

అదే సమయంలో అక్కడి జనం కోపోద్రేకులై బస్సును నిర్లక్ష్యంగా నడిపిన తాత్కాలిక డ్రైవర్ ను చితక్కొట్టారు. వారు డ్రైవర్ ను కొడుతున్న దృశ్యాలను అక్కడికి చేరిన వారిలో చాలా మంది వీడియో లు తీయడం కూడా చర్చనీయాంశంగా మారింది. మానవత్వం విడిచి పెట్టి సంచలనం వైపుగా జనం పరుగులు తీస్తున్నారనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలిచిందని చెప్పొచ్చు.

యువకుడి సెల్ఫీ పిచ్చిని.. డ్రైవర్ ని కొడుతుంటే తీసిన వీడియోను మీరూ చూడండి..




K V D Varma

K V D Varma

Next Story