ATM Card Alert: ఇలా చేయకపోతే మీ ఏటీఎం కార్డులు పనిచేయవు..!

RBI Orders to Link ATM With Mobile Number
x

ATM Card Alert: ఇలా చేయకపోతే మీ ఏటీఎం కార్డులు పనిచేయవు..!

Highlights

ATM Card Alert: ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ నెంబర్లను ఏటీఎం కార్డులతో లింక్ చేయాలి.

ATM Card Alert: ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ నెంబర్లను ఏటీఎం కార్డులతో లింక్ చేయాలి. అలా చేయని ఏటీఎం కార్డులు ఆటోమెటిక్ గా బ్లాక్ అవుతాయి. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు ఆర్ బీ ఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2025 ఫిబ్రవరి 5 లోపుగా ఏటీఎం కార్డుకు మొబైల్ ను లింక్ చేయాలని ఆర్ బీ ఐ సూచించింది.

ఏటీఎం కార్డులకు మొబైల్ నెంబర్ లింక్ చేస్తే ప్రతి లావాదేవీల వివరాలు ఆ ఖాతాదారులకు చేరుతాయి. ఖాతాదారుడికి తెలియకుండా జరిగిన లావాదేవీలపై వెంటనే అలెర్ట్ చేయవచ్చు.

అంతేకాదు అనుమానాస్పద లావాదేవీలు జరిగితే దానికి సంబంధించిన సమాచారం కూడా ఎస్ఎంఎస్ రూపంలో ఖాతారుదారిడికి చేరుతుంది. వీటిని గుర్తిస్తే బ్యాంకు మేనేజర్ లేదా బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది.

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్ బీ ఐ ఈ నిర్ణయం తీసుకుంది.

బ్యాంకులో లేదా ఏటీఎం జరిపిన ప్రతి లావాదేవీకి సంబంధించిన సమాచారం మొబైల్ కు వస్తుంది. మీకు తెలియకుండానే మీ ఏటీఎం కార్డు ద్వారా లావాదేవీలు జరిగే అవకాశాలున్నప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా అలెర్ట్ అందుతోంది. ఒకవేళ మీ కార్డును క్లోనింగ్ ద్వారా లావాదేవీలు జరిపినా ఆ విషయం మీకు చేరుతుంది. మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉందో ఆ బ్యాంకుకు వెళ్లి ఏటీఎం కార్డుకు మొబైల్ ను లింక్ చేసేందుకు దరఖాస్తు చేయాలి. లేదా ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఏటీఎం కార్డుకు మొబైల్ ను లింక్ చేయకపోతే ఏటీఎంలు ఆటోమెటిక్ గా డియాక్టివ్ అవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories