బ్యాంకుల్లో ఖాతా ఉంటే ఏం చేయాలంటే?:ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

New RBI directive to banks, NBFCs to ensure nomination in FDs and Saving Accounts
x

బ్యాంకుల్లో ఖాతా ఉంటే ఏం చేయాలంటే?:ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

Highlights

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన ఖాతాదారులు నామినీ వివరాలు పూర్తి చేయాలని ఆయా బ్యాంకులను ఆర్ బీ ఐ ఆదేశించింది. .

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన ఖాతాదారులు నామినీ వివరాలు పూర్తి చేయాలని ఆయా బ్యాంకులను ఆర్ బీ ఐ ఆదేశించింది. సేవింగ్స్ ఖాతాలు, డిపాజిట్లకు సంబంధించిన ఖాతాల్లో కూడా నామినీ వివరాలు లేని విషయాన్ని ఆర్‌బీఐ గుర్తించింది. దీంతో నామినీ వివరాలను పొందుపర్చాలని కూడా ఆర్బీఐ ఆదేశించింది. ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్లు, లాకర్లు కలిగి ఉన్న వారితో పాటుగా కొత్తగా ఖాతా తెరిచే వారు సైతం నామినీ వివరాలు పూర్తి చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

నామినీ వివరాలు లేకపోతే ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఆర్ బీ ఐ ఈ నిర్ణయం తీసుకొంది. బ్యాంకులతో పాటు నాన్ బ్యాంకింగ్ సంస్థలు కూడా నామినీ వివరాలను అప్‌డేట్ చేయాలని ఆర్ బీ ఐ సర్క్యులర్ జారీ చేసింది.

సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన ఖాతాదారుడు మరణించిన సమయంలో ఎవరికి బదిలీ చేయాలనే సమస్య తలెత్తకుండా నామినీ వివరాలు ఉండాలని ఆర్ బీ ఐ చెబుతోంది.నామినీ వివరాలు లేకపోతే ఈ డబ్బును బదిలీ చేసే సమయంలో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ డబ్బులు డిపాజిట్ చేసిన ఖాతాదారుడికి తాము చట్టపరమైన వారసులుగా ధృవీకరించుకొనే సర్టిఫికెట్లు సమర్పిస్తే ఇబ్బందులుండవు. నామినీ వివరాలు సమర్పిస్తే క్లైయిమ్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. నామినీ వివరాలను పూర్తి చేయాలని జనవరి 17న ఆర్ బీ ఐ అన్ని బ్యాంకులకు లేఖను పంపింది.

ఆయా బ్యాంకుల్లోని ఆన్ లైన్ లో కూడా తమ నామినీ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. అయితే ఆయా బ్యాంకులకు చెందిన అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ వివరాలను అప్ డేట్ చేయాలి. లేదా ఆయా బ్యాంకుల్లో సంబంధిత దరఖాస్తు ఫారం నింపాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories