Yuvraj Singh slams on BCCI: బీసీసీఐ సరిగ్గా గౌరవించలేదు.. కీలక వ్యాఖ్య‌లు చేసిన యువీ!

Yuvraj Singh slams on BCCI: బీసీసీఐ సరిగ్గా గౌరవించలేదు.. కీలక వ్యాఖ్య‌లు చేసిన యువీ!
x
yuvaraj singh (File photo)
Highlights

Yuvraj Singh slams on BCCI: భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఆల్‌రౌండర్ గా ఎదిగాడు యువరాజ్ సింగ్.. ఎన్నో మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించాడు యువరాజ్ సింగ్.

Yuvraj Singh slams on BCCI: భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఆల్‌రౌండర్ గా ఎదిగాడు యువరాజ్ సింగ్.. ఎన్నో మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించాడు యువరాజ్ సింగ్... అయితే కెరీర్ చివర్లో మాత్రం ఉహించని పరిస్థితిని ఎదురుకున్నాడు. కనీసం వీడ్కోలు మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు యువరాజ్ సింగ్.. దీనితో 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే కెరీర్ చివర్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవమానకర రీతిలో సెండాఫ్ ఇచ్చిందని అన్నాడు. అయితే ఇదేం తనకి ఆశ్చర్యంగా అనిపించలేదని అన్నాడు. ఎందుకంటే గతంలో భారత జట్టుకి ఎన్నో ఏళ్లుగా సేవలను అందించిన సెహ్వాగ్, జహీర్ ఖాన్ లాంటి ఆటగాళ్ళను కూడా ఇదే తరహాలో బోర్డు పెద్దలు అవమానించారని, ఇది చూసిన అనుభవం ఉండడంతో ఇదేం ఆశ్చర్యానికి గురి చేయలేదని అన్నాడు.

బారత జట్టుకు యువరాజ్ సింగ్ 19 ఏళ్లుగా సేవలను అందించాడు. ఇక ఇండియన్ టీం గెలిచిన 2007,2011ప్రపంచ కప్ లో యువీదే కీ రోల్.. 2011ప్రపంచ కప్ లో యువీ మొత్తం 362 పరుగులను చేసి , 15 వికెట్లను పడగొట్టాడు. దాంతో.. అతనికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత క్యాసర్ బారిన పడిన యువీ కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఫిట్ నెస్ సాధించి జట్టులో స్థానం సంపాదించాడు. అయితే అతని ఆట మాత్రం పూర్వం లాగా సాగలేదు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ టోర్నీ జరుగుతుండగానే యువీ కెరీర్‌కి గుడ్‌బై చెప్పేసి అందరికి షాక్ ఇచ్చాడు.

"నా కెరీర్ చివరిలో బీసీసీఐ నిర్వహించిన విధానం మాత్రం వృత్తిపరమైనది కాదని నేను భావిస్తున్నాను.. కానీ దీనివలన నేను ఆశ్చర్యపోలేదు .. ఎందుకంటే సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి గొప్ప ఆటగాళ్ళను కూడా ఇదే తరహాలో బోర్డు పెద్దలు అవమానించారు. ఇది భారత క్రికెట్‌లో భాగం అయిపొయింది. అని యువరాజ్ స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు .ఇక యువరాజ్ సింగ్ 304 వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లు ఆడాడు. అందులో 14 సెంచరీలు మరియు 52 అర్ధ సెంచరీల సహాయంతో 8,701 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో 111 వికెట్లు పడగొట్టాడు. అయితే యువరాజ్ ఎక్కువగా టెస్ట్ మ్యాచ్ లు ఆడలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories