కరోనాపై పోరాటం : యువీ, భజ్జీ భారీ విరాళాలు

కరోనాపై పోరాటం : యువీ, భజ్జీ భారీ విరాళాలు
x
yuvaraj singh and harbhajan Singh (File Photo)
Highlights

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాల చేస్తున్న ఈ పోరాటానికి సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు. పీఎం సహాయనిధితో పాటు రాష్ట్ర సీఎంల సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు రోహిత్ శర్మ రూ. 80 లక్షలు, సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, గంగూలీ 50 లక్షలు, రహానె రూ. 10 లక్షలు ,విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి రూ. 3 కోట్లు విరాళం అందజేశారు.

ఇక తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ ఆటగాడు యువరాజ్, భారత్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చేరిపోయారు. పీఎం కేర్స్‌కు రూ.50 ల‌క్ష‌ల ఆర్థిక విరాళ‌మిస్తున్నట్లు యువరాజ్ సింగ్ వెల్లడించాడు. దేశమంతా ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటాం. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు కొవ్వొత్తులు వెలిగిస్తున్నాను. నాతో మీరు కూడా వెలిగిస్తారా? ఈ ప్రత్యేకమైన రోజున పీఎంకేర్స్‌కు రూ.50 లక్షలు సాయంగా అందిస్తున్నాను. మీరు కూడా వీలైనంత సాయం చేయండి' అంటూ ట్వీట్ చేశాడు.

ఇక మ‌రోవైపు భారత సీనియ‌ర్ స్పిన్నర్ హ‌ర్భజ‌న్‌సింగ్ తన సొంత‌రాష్ట్రం అయిన పంజాబ్ లోని జ‌లంధ‌ర్‌లో త‌న భార్య, సినీ న‌టి గీతా బ‌స్రాతో క‌లిసి 5వేల కుటుంబాల‌కు రేష‌న్ అందించ‌నున్నట్లు భ‌జ్జీ వెల్లడించాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories