ప్రపంచ కప్ చాంపియన్ షిప్: సెమీస్ లో తెలుగు తేజాలు

ప్రపంచ కప్ చాంపియన్ షిప్: సెమీస్ లో తెలుగు తేజాలు
x
Highlights

ప్రపంచ కప్ చాంపియన్ షిప్ పోటీల్లో తెలుగు తేజాలు వెలుగులు విరజిమ్మాయి. ఒకే రోజు రెండు విజయాలు..ఇటు పురుషుల విభాగంలో ఒకటి.. అటు మహిళల విభాగంలో ఒకటి.....

ప్రపంచ కప్ చాంపియన్ షిప్ పోటీల్లో తెలుగు తేజాలు వెలుగులు విరజిమ్మాయి. ఒకే రోజు రెండు విజయాలు..ఇటు పురుషుల విభాగంలో ఒకటి.. అటు మహిళల విభాగంలో ఒకటి.. రెండూ సంచలనాలే. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తమకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న క్రీడాకారులపై అద్వితీయ విజయాలు సాధించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఐదో ర్యాంకర్, పీవీ సింధు 71 నిమిషాల్లో 12–21, 23–21, 21–19తో రెండో ర్యాంకర్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 19వ ర్యాంకర్, సాయిప్రణీత్‌ 51 నిమిషాల్లో 24–22, 21–14తో నాలుగో ర్యాంకర్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)ను మట్టికరిపించాడు.

ఈ మ్యాచ్‌కంటే ముందు తై జు యింగ్‌తో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన సింధు... తొలి గేమ్‌ తర్వాత వెనుకబడి కొంత ఆందోళన కలిగించింది. అయితే, తరువాత పుంజుకుని రెండో గేమ్‌లో 5–8తో వెనుకంజ లో ఉంది. ఈ కీలక సమయంలో సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు వరుసగా ఐదు పా యింట్లు గెలిచి 10–8తో ఆధిక్యంలోకొచ్చింది. అయితే తై జు యింగ్‌ కూడా పట్టుదలతో ఆడటంతో ఐదుసార్లు స్కోర్లు సమమయ్యాయి.

స్కోరు 21–21 వద్ద సింధు చక్కటి రిటర్న్‌ షాట్, ఆ తర్వాత క్రాస్‌కోర్టు షాట్‌లతో వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌ ఆరంభంలోనూ సింధు తడబడింది. 4–8తో వెనుకబడింది. అయితే ఈసారీ సింధు అద్భుతంగా పుంజుకుంది. స్కోరును 14–14 వద్ద సమం చేశాక ఇద్దరూ ప్రతీ పాయింట్‌ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 19–19 వద్ద ఉన్నపుడు సింధు స్మాష్‌ షాట్‌తో ఒక పాయింట్‌ సాధించగా... ఆ తర్వాత తై జు యింగ్‌ కొట్టిన రిటర్న్‌ షాట్‌ బయటకు వెళ్లడంతో సింధు విజయం ఖాయమైంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories