ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌: అలవోకగా ప్రారంభమైన సింధు సైనాల టైటిల్ ప్రస్థానం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌: అలవోకగా ప్రారంభమైన సింధు సైనాల టైటిల్ ప్రస్థానం
x
Highlights

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ సునాయాస విజయాలు సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు.

భారత్ కు ఎలాగైనా పసిడి పతకం అందించడమే లక్ష్యంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ లో పోటీపడుతున్న పీవీ సింధు, సైనా నెహ్వాల్ లు దూకుడుగా ముందడుగు వేశారు. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో పీవీ సింధు చైనీస్ తైపీ క్రీదాకారిణి పాయ్ యు పో పై వరుస సెట్లలో విజయం సాధించింది. ప్రత్యర్థి ఏమాత్రం సింధుకు పోటీ ఇవ్వలేకపోయింది. ఆట ప్రారంభంలోనే ఆధిక్యతను ప్రదర్శించిన సింధు చివరి వరకూ అదే జోరును కొనసాగించింది. దీంతో 2-0 (21–14, 21–15)తో మ్యాచ్ గెలుచుకుంది. ఇక మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. నెదర్లాండ్స్ కు చెందిన సొరాయ డివిష్‌ పై వరుస సెట్లలో విజయం సాధించింది. సైనా జోరు ముందు సొరాయ ఏమాత్రం నిలువలేకపోయింది. 2-0 (21–10, 21–11) తేడాతో ఓటమి పాలైంది.

గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో తొమ్మిదో సీడ్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)తో సింధు; 12వ సీడ్‌ మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)తో సైనా నెహ్వాల్‌ తలపడతారు.

ప్రి క్వార్టర్స్ లో శ్రీకాంత్...

పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఏడో సీడ్‌ శ్రీకాంత్‌ (భారత్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మిషా జిల్బెర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)తో జరిగిన రెండో రౌండ్‌లో

శ్రీకాంత్‌ 13–21, 21–13, 21–16తో నెగ్గాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కెంటో మొమోటా (జపాన్‌)తో ప్రణయ్‌; ఆంథోని (ఇండోనేసియా)తో

సాయిప్రణీత్‌; కాంతాపోన్‌(థాయ్‌లాండ్‌)తో శ్రీకాంత్‌ పోటీపడతారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories