పుంజుకున్న విండీస్ : భారత్ విజయలక్ష్యం 147

K V D Varma
Published on: 6 Aug 2019 10:52 PM IST
పుంజుకున్న విండీస్ : భారత్ విజయలక్ష్యం 147
X

అర్థ సెంచరీ చేసి ఊపు మీదున్న పోలార్డ్ మరో ఎనిమిది పరుగులు చేసి సైనీ బౌలింగ్ లో ఔటయ్యాడు. దాంతో విండీస్ పరిస్థితి మల్లి మొదటికి వచ్చినట్టయింది. పోలార్డ్ అవుతయ్యకా క్రీజులోకి వచ్చిన బ్రెత్ వైట్ ఓ బౌండరీ బాడి జోరుమీద కనబడ్డాడు. కానీ, పది పరుగులు చేసి ఇన్నింగ్స్ 17వ ఓవర్ లో రాహుల్ చాహర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. తరువాత వచ్చిన అలెన్ తో కల్సి పొవెల్ ఇన్నింగ్స్ నడిపించాడు. 19వ ఓవర్ చివరి బంతికి అలెన్ సిక్స్ కొట్టాడు. అటు తరువాత 20వ వోవర్లో పొవెల్ రెండు సిక్సర్లు బాదడంతో విండీస్ స్కోరు 146 పరుగులకు చేరింది. మొత్తమ్మీద పొవెల్ 20 బంతుల్లో 32 పరుగులు చేశాడు. టీమిండియా ముందు 147 పరుగుల విజయలక్ష్యాన్ని నిలబెట్టింది విండీస్.


K V D Varma

K V D Varma

Next Story