పూర్తి ఆధిపత్యం సాధించిన భారత్

పూర్తి ఆధిపత్యం సాధించిన భారత్
x
Highlights

టీమిండియాకు టెస్ట్ సిరీస్ ముందు మంచి ప్రాక్టీస్ దొరికింది. వెస్టిండీస్ ఎ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ లో రెండో రోజు భారత బౌలర్లు సత్తా చాటారు. విండీస్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఆధిక్యాన్ని సాధించారు.

వెస్టిండీస్ టూర్ లో భాగంగా టెస్ట్ సిరీస్ ముందు భారత జట్టుకు మంచి ప్రాక్టీస్ లభించింది. వెస్టిండీస్ ఎ తో మూడురోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు మొదటి రోజు బ్యాటింగ్ లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు ఆదివారం బౌలింగ్లో తన సత్తా చాటింది టీమిండియా. 297 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది భారత్. తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పేసర్లు ఇషాంత్‌ శర్మ (3/21), ఉమేశ్‌ యాదవ్‌ (3/19); స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/35) విండీస్ ను కోలుకోకుండా కుప్పకూల్చారు. దీంతో టీ విరామానికి ముందు విండీస్ జట్టు 181పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఓపెనర్ హడ్జ్ ఒక్కడే 51పరుగులతో ఆకట్టుకున్నాడు.

116 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు ఒక వికెట్‌ నష్టానికి 84 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(13) మరోసారి విఫలమయ్యాడు. ప్రస్తుతం రహానే(20), విహారి(48) క్రీజులో ఉన్నారు. ఈరోజు కూడా ఇదేవిధమైన ప్రదర్శన కనబరిస్తే, టీమిండియాకు గెలుపు అవకాశం ఉంటుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories