కోహ్లీ రికార్డుల మోత!

కోహ్లీ రికార్డుల మోత!
x
Highlights

వరుసగా రెండు వన్డేల్లో రెండు సెంచరీలు. వెస్టిండీస్ టూర్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘనత ఇది. వరల్డ్ కప్ లోనూ సెంచరీల మెరుపులు మెరిపించిన కోహ్లీ దానిని కొనసాగిస్తున్నాడు.

వరుసగా రెండు వన్డేల్లో రెండు సెంచరీలు. వెస్టిండీస్ టూర్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘనత ఇది. వరల్డ్ కప్ లోనూ సెంచరీల మెరుపులు మెరిపించిన కోహ్లీ దానిని కొనసాగిస్తున్నాడు. ఈ వరుసలో పాత రికార్డులు బద్దలవుతున్నాయి. కొన్ని రికార్డులని బద్దలు కొట్టేందుకు వేగంగా దూసుకుపోతున్నాడు కోహ్లీ.

వెస్టిండీస్ తో మూడో వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లీ కొన్ని రికార్డులు సృష్టించాడు. అవి ఇవే..

అర్థ సెంచరీలలో ఐదో స్థానంలో..

వన్డేల్లో అత్యధిక అర్థ సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. కానీ, వేగవంతంగా ఈ స్థాన్నాన్ని చేరుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అత్యధిక అర్థ సెంచరీలు చేసాడు. 463 వన్డేల్లో 145 సార్లు 50 పరుగులకు మించి సచిన్ చేసి అగ్ర స్థానం లో ఉన్నాడు. కోహ్లీ 239 మ్యాచుల్లోనే 97 సార్లు 50 పరుగులకు మించి సాధించాడు. అంతే కాదు ఒకే ఏడాది అత్యధిక అర్థ సెంచరీలు బాదిన వారిలో నిలిచాడు కోహ్లీ. అతను 22 ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు అర్థ సెంచరీలు సాధించాడు. కోహ్లీ తరువాత రోహిత్ శర్మ నిలిచాడు. 24 ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు అర్థ సెంచరీలు చేశాడు రోహిత్.

కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు..

ఈ విభాగంలో రెండో స్థానంలో ఉన్నాడు కోహ్లీ. రికీ పాంటింగ్ 22 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా.. కోహ్లీ 21 సెంచరీలతో అతని వెనుకే ఉన్నాడు.

ఒకే జట్టుపై అత్యధిక శతకాలు..

ఇందులో సచిన్ తో సమానంగా నిలిచాడు కోహ్లీ. సచిన్ ఆస్ట్రేలియా టీం పై 9 సెంచరీలు చేశాడు. కాగా కోహ్లీ వెస్టిండీస్ పై 9 సెంచరీలు సాధించాడు.

వేగంగా సెంచరీలు..

సచిన్‌ 43వ శతకాన్ని 415 ఇన్నింగ్స్‌లో అందుకోగా కోహ్లీ 230 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఘనత సాధించాడు. వన్డేల్లో సచిన్‌ కంటే 185 ఇన్నింగ్స్‌ల ముందుగానే 43వ శతకం బాదేశాడు కోహ్లీ. ఇదే వరుస కొనసాగితే ఎలావుంటుందో ఊహించలేం.

విండీస్‌పై హ్యాట్రిక్‌ సెంచరీ..

వన్డేల్లో వెస్టిండీస్‌లో వరుసగా మూడు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడు కోహ్లీ మాత్రమే. 2017లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శతకం బాదిన కోహ్లీ రెండేళ్ల తర్వాత విండీస్‌ పర్యటనకు వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో రెండో వన్డేలో 120 పరుగులు, మూడో వన్డేలో 114* పరుగులు చేశాడు. దీంతో వరుసగా మూడు శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

పదేళ్ళలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు..

గత పదేళ్ళలో 20,018 పరుగులు సాధించిన కోహ్లీ.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను తోసిరాజని మొదటి స్థానంలో నిలిచాడు. పాంటింగ్ ఈ విభాగంలో 18,962 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వెస్ కలిస్‌ (16,777), శ్రీలంక ఆటగాళ్లు జయవర్ధనే (16,304), కుమార సంగక్కర (15,999), మాస్టర్ బ్లాస్టర్ సచిన్ (15,962) తరువాతి స్థానాల్లో ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories