Sourav Ganguly about MS Dhoni: అదే న‌న్ను ధోని అభిమానిగా మార్చింది..గంగూలీ ఆసక్తికర వాఖ్యలు

Sourav Ganguly about MS Dhoni: అదే న‌న్ను ధోని అభిమానిగా మార్చింది..గంగూలీ ఆసక్తికర వాఖ్యలు
x
Sourav Ganguly, MS Dhoni (File Photo)
Highlights

Sourav Ganguly about MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Sourav Ganguly about MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా తనకంటూ భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు ధోని.. వ‌న్డే, టెస్టు, టీ20 ల్లో టీంఇండియాను నంబ‌ర్‌వ‌న్ స్థానంలో నిలిపాడు. కూల్ కెప్టెన్ , జార్ఖండ్ డైనమైట్ గా ధోనీని ముద్దుగా పిలుచుకుంటారు ఫ్యాన్స్.. ఇవ్వాలా ధోని తన 39 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.. ఈ సందర్భంగా భారత ఆటగాళ్ళు, ఫ్యాన్స్ ధోనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అందులో భాగంగానే భారత మాజీ ఆటగాడు, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీ ధోనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధోనితో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. గంగూలీ నాయకత్వంలో ఉన్నప్పుడు ధోని టీం ఇండియా జట్టుకు ఎంపిక అయిన సంగతి తెలిసిందే.. 2004లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వ‌న్డేలో ధోని తన మొదటి మ్యాచ్ ని ఆడాడు... "2004లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన సిరీస్‌లో ధోనిని ఎంపిక చేయాల‌ని సెలెక్టర్లను నేను కోరాను. ధోని ఆ మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యాడు. కానీ అత‌ని ఆట‌తీరుపై నాకు న‌మ్మక‌ముంది. ఇక పాక్ తో జరిగిన రెండో మ్యాచ్ లో ద్రావిడ్ స్థానంలో ధోనిని పంపించాను. అప్పుడు ధోని తన ఆటను ప్రపంచానికి పరిచయం చేశాడు.

మంచి ఫినిష‌ర్ గా కూడా ఎన్నో మ్యాచ్‌ల్లో తన టాలెంట్ ని చూపించాడు. ప్రతి సంవత్సరం క్రికెట్ లోకి చాలా మంది ఆటగాళ్ళు పరిచయం అవుతారు. కానీ ఓ దశాబ్ద కాలం పాటు కొంద‌రే క్రికెటర్లు త‌మ‌దైన ముద్ర వేస్తారు అందులో ధోని ఒకడు.. చాలా మ్యాచ్ లలో ఒత్తిడిని జ‌యించి చాలా కూల్ గా జట్టును విజయతీరాలకి చేర్చాడు. అందుకే నేను మహేంద్ర సింగ్ ధోనికి ప్రియ‌మైన అభిమానిగా మారిపోయాను. ధోని లాంటి ఆటగాడు దొరకడం టీమిండియా చేసుకున్న అదృష్టంగా చెప్పుకోవచ్చు అంటూ మ‌యాంక్ అగ‌ర్వాల్‌తో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో గంగూలీ చెప్పుకొచ్చాడు.

ఇక విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా పాక్‌తో జరిగిన మ్యాచ్ లో ధోని చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో ధోని 123 బంతుల్లోనే 15 బౌండ‌రీలు 4 సిక్స్‌ల సాయంతో 148 ప‌రుగులు చేశాడు. అటు క్రికెట్ లోకి వచ్చిన మూడేళ్లకే కెప్టెన్ అయ్యాడు..2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు ధోని.




Show Full Article
Print Article
Next Story
More Stories