Happy Birthday MS Dhoni: 39 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కూల్ కూల్ ధోని!

Happy Birthday MS Dhoni: 39 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కూల్ కూల్ ధోని!
x
MS Dhoni (file photo)
Highlights

Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోని.. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా తనకంటూ భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోని.. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా తనకంటూ భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. కూల్ కెప్టెన్ , జార్ఖండ్ డైనమైట్ గా ధోనీని ముద్దుగా పిలుచుకుంటారు ఫ్యాన్స్.. ఇవ్వాలా ధోని తన 39 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.. ఫ్యాన్స్ ధోనీకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధోని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

★ ధోని 1981 జూలై 7 న జార్ఖండ్ రాష్ట్రంలో జన్మించాడు

★ ధోని తన ఫస్ట్ వన్డే మ్యాచ్ ని బంగ్లాదేశ్ తో డిసెంబరు 2004 లో ఆడాడు. ఒక సంవత్సరం తరువాత శ్రీలంకతో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు...

★ 2005లో విశాఖలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 148 రన్స్ చేసి అదరగొట్టాడు.. ధోనికి ఇది అయిదో మ్యాచ్ కావడం విశేషం..

★ ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 183 రన్స్ ఛేజ్ చేసి... ప్రపంచంలో బెస్ట్ ఫినిషర్స్‌లో ఒకడిగా నిలిచాడు.

★ హెలికాప్టర్ షాట్ అంటే ధోని.. ధోని అంటేనే హెలికాప్టర్ షాట్..

★ క్రికెట్ లోకి వచ్చిన మూడేళ్లకే కెప్టెన్ అయ్యాడు..2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు ధోని..

★ 2007 సౌత్ ఆఫ్రికాలో జరిగిన టీ 20 ప్రపంచ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీం ఇండియా కుర్ర జట్టుకు కూల్ గా కెప్టెన్ గా వ్యవహరిస్తూ కప్ ని సాధించి పెట్టాడు ధోని..

★ గెలుపులోనే కాదు ఓటమిలో కూడా సహనాన్ని కోల్పోకుండా ఉంటూ కెప్టెన్ కి కొత్త అర్ధం చెప్పాడు ధోని.

★ 2009లో ధోనీ మొదటి సారి భారత్ జట్టును ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలబెట్టాడు..

★ 2013 లో ధోని కెప్టెన్సీ లోని భారత్ 40 సంవత్సరాల తరువత ఒక టెస్ట్ సీరీస్ లో ఆస్ట్రేలియాను వైట్వాష్ చేసింది.

★ ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ ట్వంటీ 20 గెలుచుకున్న మొదటి కెప్టెన్ గా ధోని రికార్డు సృష్టించాడు..

★ ధోని కెప్టెన్సీ లో భారత్ 2007 ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ, 2007-08 సి.బి సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ లను గెలుచుకుంది.

★ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరుపున కెప్టెన్ గా వ్యవహరించి మూడు ట్రోఫీ లను సొంతం చేసుకున్నాడు..

★ ధోనీ తన కెరీర్‌లో 90 టెస్టులు ఆడి 4876 రన్స్ చేశాడు. ఇక 350 వన్డేల్లో 10773 రన్స్ చేశాడు. అటు 98 టీ20లు ఆడి 1617 రన్స్ చేశాడు.

★ గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత ధోని జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తన సొంత ఊళ్ళోనే సేంద్రియ వ్యవసాయం చేసుకుంటున్నాడు..


Show Full Article
Print Article
Next Story
More Stories