సింధూ కు పద్మ భూషణ్?

సింధూ కు పద్మ భూషణ్?
x
Highlights

బ్యాడ్మింటన్ లో దూసుకు పోతున్న తెలుగు తేజం పీవీ సింధూ, బాక్సర్ మేరీ కొమ్ లకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వాలంటూ క్రీడా శాఖ అవార్డుల కమిటీకి సిఫారసు చేసింది.

బ్యాడ్మింటన్ లో దూసుకుపోతున్న తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు కు పద్మ భూషణ్ అవార్డ్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 2020 సంవత్సరానికి గానూ పద్మ అవార్డుల కమిటీకి క్రీడాశాఖ ప్రతిపాదించింది. జాతీయ మీడియాల్లో వచ్చిన కథనాల ప్రకారం ఈసారి పద్మ అవార్డుల కోసం మొత్తం మహిళలతో ఒక జాబితాను క్రీడా శాఖ పంపించినట్టు తెలుస్తోంది.

ఈ జాబితాలో సింధుకు దేశంలోని మూడో అత్యుత్తమ పురస్కారం పద్మ భూషణ్ ఇవ్వాలని సిఫారసు చేశారని తెలుస్తోంది. కాగా రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కోసం ఆరుసార్లు బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ గా నిలిచిన మేరీ కొం పేరును ప్రతిపాదించారని చెబుతున్నారు. సింధు, మేరీ కొమ్ లతో పాటు మరో ఏడుగురు మహిళా అథ్లెట్ ల పేర్లను సిఫారసు చేశారని వార్తలు అందుతున్నాయి. రెజ్లర్ వినేష్ ఫోగాట్, టేబుల్ టెన్నిస్ స్టార్ మానికా బాత్రా, క్రికెటర్ హర్మంప్రీత్ కౌర్, హాకీ కెప్టెన్ రాణి రాంఫాల్, మాజీ శూతర్ సుమ శ్రూర్, పర్వతారోహకులు తాషి, సుంగ్షీ మాలిక్ పేర్లను పద్మశ్రీ పురస్కారాల కోసం ప్రతిపాదించినట్టు జాతీయ్ మీడియా పేర్కొంది.

ఈసారి సింధు కు తప్పనిసరి..

గతంలో కూడా సింధు కు పద్మ భూషణ్ అవార్డు ఇవ్వాలని క్రీడా శాఖ ప్రతిపాదించింది. అయితే అవార్డుల కమిటీ ఆమెను ఎంపిక చేయలేదు. కాగా, ఈసారి ఆమె ప్రపంచ చాంపియన్ గెలిచింది. దీంతో పీవీ సింధు కు పద్మ భూషణ్ అవార్డు తప్పనిసరిగా వస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే సింధు కు 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఇక మేరీ కొమ్ కు 2006 లోనే పద్మశ్రీ వారించగా. 2013 లో పద్మ భూషణ్ దక్కింది. ఈసారి కనుక ఆమెకు పద్మ విభూషణ్ ఇస్తే.. ఈ అవార్డులు గెలుచుకున్న నాలుగో క్రీడాకారిణిగా మేరికోం రికార్డ్ సాధిస్తారు. ఇంతకూ ముందు విశ్వనాద్ ఆనంద్, సచిన్ టెండూల్కర్, సర్ ఎడ్మండ్ హిల్లరీ లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories