Rashid Khan: ఆ ఘ‌న‌త‌ సాధించడ‌మే మా అతి పెద్ద ల‌క్ష్యం: ర‌షీద్ ఖాన్‌

Rashid Khan: ఆ ఘ‌న‌త‌ సాధించడ‌మే మా అతి పెద్ద ల‌క్ష్యం: ర‌షీద్ ఖాన్‌
x

Rashid Khan: Our dream is to win the T20 World Cup

Highlights

Rashid Khan: టీ20 ప్రపంచకప్ గెలవడమే తమ అతిపెద్ద లక్ష్యమని అఫ్గాన్ స్టార్​ స్పిన్నర్ రషీద్ ఖాన్ అన్నాడు. త‌మ జ‌ట్టు ఆ ఘ‌న‌త‌ సాధించాలని యావత్ అఫ్గానిస్థాన్ ఆశిస్తోందన్నాడు

Rashid Khan: టీ20 ప్రపంచకప్ గెలవడమే తమ అతిపెద్ద లక్ష్యమని అఫ్గాన్ స్టార్​ స్పిన్నర్ రషీద్ ఖాన్ అన్నాడు. త‌మ జ‌ట్టు ఆ ఘ‌న‌త‌ సాధించాలని యావత్ అఫ్గానిస్థాన్ ఆశిస్తోందన్నాడు. తాజాగా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్ లో రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

తమ జట్టు తదుపరి లక్ష్యం టీ20 ప్రపంచకప్ గెల‌వ‌డ‌మ‌నీ, ఈ ఘ‌న‌త సాధించాల‌ని యావత్ దేశం ఆశిస్తున్న‌దనీ, ఎందుకంటే టైటిల్ గెలవగలే సామర్థ్యం, నైపుణ్యం మా జట్టుకు ఉందని అన్నారు. ఇది సాధించగలమనే నమ్మకం ఉంది. మా జట్టులో టాలెంటెడ్​ స్పిన్నర్లు, పేసర్లు, బ్యాట్స్​మెన్ ఉన్నారు. అయితే మేం రెగ్యులర్​గా టాప్​ జట్లతో ఆడాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మేం మరింత అత్యుత్తమంగా తయారవుతాం. ఏదో ఒకరోజు టీ20 ప్రపంచకప్ గెలుస్తాం. ఇదే మా కల. ఆ కలను సాకారం చేసుకునేలా కృషిచేస్తాం. ఆ క్షణమే అఫ్గాన్ క్రికెట్‌కు, మాకు అతిపెద్ద విజయం దక్కినట్లు అని రషీద్ ఖాన్ చెప్పారు.

రెండేండ్లుగా ఆఫ్ఘన్​ జట్టులో టీ20 స్పెషలిస్టులు పెరిగిపోతున్నారు. ఆ జట్టు నుంచి ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ తరఫున రషీద్ ఖాన్​, మహమ్మద్ నబీ, కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్ తరఫున ముజీబుర్ రహ్మాన్ ఆడుతున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories