శభాష్ సింధు! ప్రధాని మోడీ అభినందన

శభాష్ సింధు! ప్రధాని మోడీ అభినందన
x
Highlights

ప్రపంచ చాంపియన్ షిప్ లో పసిడి పతాకాన్ని సాధించిన తెలుగు తేజం సింధు ఈరోజు తన కోచ్ పుల్లెల గోపీచాంద్ తో కలిసి ప్రధాని మోడీ ని కలిసారు. ఈ సందర్భంగా మోడీ ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ఆ ఫోటోలను అయన ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.

తన అద్వితీయ ప్రతిభతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు సోమవారం రాత్రి డిల్లీ చేరుకున్నారు. ఆమెకు అక్కడ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఈరోజు ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు. కోచ్ గోపీచంద్ తో కలసి అయన ప్రధాని నివాసానికి వెళ్ళారు. ఈ సందర్భంగా ప్రధాని ఆమెను, గోపీచంద్ ను అభినందించారు. సింధు మేడలో పసిడి పతకం వేసి సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ లో ఉంచారు మోడీ.

'బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్‌ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా' అని మోడీ ట్వీట్‌ చేశారు.

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రపంచ స్వర్ణ పతకాన్ని సింధు మాత్రమే గెలవగలిగింది. ఎంతో మంది మహామహులు అక్కడ విజయం సాధించాలని ప్రయత్నించినా సాధించలేకపోయారు. గతంలో మూడు సార్లు సింధు ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో ఫైనల్స్ వరకూ వచ్చి త్రుటిలో స్వర్ణం చేజార్చుకున్నారు. ఈసారి ఆమె పట్టుదలతో తాను అనుకున్నది సాధించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories