IPL 2020: ప్ర‌తీకార‌పోరులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై

IPL 2020: ప్ర‌తీకార‌పోరులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై
x
Highlights

IPL 2020: ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర రంమ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టేబుల్ టాప్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ లు త‌ల‌ప‌డనున్నాయి. చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ టాస్ గెలిచి, బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

IPL 2020: ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టేబుల్ టాప్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ లు త‌ల‌ప‌డనున్నాయి. చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ టాస్ గెలిచి, బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పియూశ్‌ చావ్లా స్థానంలో కేదార్‌ జాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు మహీ తెలిపాడు.

ఇటు ఢిల్లీ జ‌ట్టులోనూ రిషబ్‌ పంత్‌కు విశ్రాంతినిచ్చినట్లు ఢిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ వివరించాడు. ప్రస్తుతం ఢిల్లీ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు చెన్నై మూడు విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ కు ఇదే కీలక పోరు. దాంతో పాటు తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీసుకోవాలని ధోనీ సేన భావిస్తోంది. మరోవైపు ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంటున్న ఢిల్లీ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. మరీ ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి!

జట్ల వివరాలు

ఢిల్లీ ఫ్లేయింగ్ లెవ‌న్‌: ధావన్‌, పృథ్వీ షా, రహానె, శ్రేయస్‌ అయ్యర్‌, స్టాయినిస్‌, అలెక్స్‌ కేరీ, అక్షర్‌ పటేల్, రబాడ, ఆర్‌ అశ్విన్, నోర్జె, దేశ్‌పాండే

చెన్నై ఫ్లేయింగ్ లెవ‌న్‌: డుప్లెసిస్‌, సామ్‌ కరన్, షేన్ వాట్సన్‌, రాయుడు, ఎంఎస్ ధోనీ, జడేజా, బ్రావో, కేదార్ జాదవ్, దీపక్‌ చాహర్, శార్దూల్ ఠాకూర్‌, కర్ణ్‌ శర్మ

Show Full Article
Print Article
Next Story
More Stories