IPL 2020: నేడు రాజ‌స్థాన్‌కు చావోరేవో.. కోహ్లీ సేనతో ఢీ..

IPL 2020: నేడు రాజ‌స్థాన్‌కు చావోరేవో.. కోహ్లీ సేనతో ఢీ..
x

IPL 2020: నేడు రాజ‌స్థాన్‌కు చావోరేవో.. కోహ్లీ సేనతో ఢీ..

Highlights

IPL 2020: ఐపీఎల్ 2020లో ప్రతిరోజూ ఓ ఉత్కంఠ మ్యాచ్ కు వేదిక అవుతుంది. నేడు కూడా .. మ‌రో ఉత్కంఠ మ్యాచ్ కు జ‌రుగునున్న‌ది. శనివారం మధ్యాహ్నం రాజస్థాన్ , బెంగళూరు జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

IPL 2020: ఐపీఎల్ 2020లో ప్రతిరోజూ ఓ ఉత్కంఠ మ్యాచ్ కు వేదిక అవుతుంది. నేడు కూడా .. మ‌రో ఉత్కంఠ మ్యాచ్ కు జ‌రుగునున్న‌ది. శనివారం మధ్యాహ్నం రాజస్థాన్ , బెంగళూరు జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ .. బెంగళూరు 8 మ్యాచులు ఆడి.. 5 మ్యాచ్‌లో గెలుపొంది.. మూడో స్థానంలో ఉంది. ఫ్లే ఆప్ బెర్త్ ఖాయం కావాలంటే .. బెంగుళూర్ మరో రెండు మ్యాచ్‌లో విజయాలు సాధించాలి.

మరోవైపు రాజస్థాన్ క్లిష్ట ప‌రిస్థితిలో ఉంది. ఆడే ప్ర‌తి మ్యాచ్ వారికి చాలా కీల‌క‌మే. ఇప్ప‌టివ‌ర‌కూ రాజ‌స్థాన్ కేవ‌లం మూడు మ్యాచ్ లో గెలుపొందింది. దీంతో ఆ జ‌ట్టు 7 స్థానంలో నిలిచింది. . అన్ని మ్యాచులు గెలిస్తేనే అధికారిక ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. రాజస్థాన్, బెంగళూరు జట్లు ఇప్పటి వరకూ 21సార్లు ఎదురుపడ్డాయి. అందులో 10 మ్యాచుల్లో రాజస్థాన్‌ పైచేయి సాధించింది. 9 మ్యాచులలో బెంగళూరు గెలిచింది. రెండు మ్యాచులు రద్దయ్యాయి. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన చేతిలో రాజస్థాన్‌ ఓడింది.

గత మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లీ తీసుకున్న నిర్ణయం మ్యాచ్‌ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపించిందని విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్ లో ఎలాంటి ప్ర‌యోగాలు లేకుండా ఆడాల‌ని యోచిస్తుంది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఏబీడివిలియ‌ర్స్‌, ఆరోన్ ఫించ్‌లు రాణిస్తున్నారు. బెంగళూరు బౌలర్లు బాగానే రాణిసున్నారు. క్రిస్‌ మోరిస్‌, యుజ్వేంద్ర చహల్ లు మంచి ప్ర‌ద‌ర్శ‌న నిస్తున్నారు. ఉదాన, సైనీ, సిరాజ్ లు ఫామ్‌లోకి వ‌స్తే.. బెంగ‌ళూర్‌కు తిరుగు ఉండ‌దు.

సీజన్‌ ఆరంభంలో బలంగా కనిపించిన స్మిత్‌సేన క్రమంగా బలహీనమయింది. పవర్‌ప్లేలో ఎక్కువగా వికెట్లు కోల్పోతుండటం ఆ జట్టును కలవరపెడుతోంది. ఓపెనర్లను మార్చినా ఫలితం లేదు. సంజు శాంసన్‌ మళ్లీ తన దూకుడు ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం చాలా ఉంది. స్మిత్‌, స్టోక్స్‌, బట్లర్‌ బ్యాటుతో రాణిస్తే భారీ స్కోర్ న‌మోదు చేయ‌వ‌చ్చు. యువ ఆటగాళ్లు పరాగ్‌, తెవాతియా మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్‌ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్‌ ఒంటరి పోరు చేస్తున్నాడు. జయదేవ్ ఉనద్కత్‌ ఇంతవరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. శ్రేయస్‌ గోపాల్‌, కార్తిక్‌ త్యాగిది కూడా అదే పరిస్థితి. అందరూ సమిష్టిగా రాణిస్తేనే స్మిత్‌సేన విజ‌యం సాధించ‌డం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories