Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టుకు మరో విజయం

Tokyo Olympics: క్వార్టర్స్‌ ఆశలు సజీవంగా నిలుపుకున్న టీమిండియా * గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలుపు

Sandeep Eggoju
Updated on: 31 July 2021 1:47 PM IST
Indian Womens Hockey Team Won Tokyo Olympics
X

ఉమెన్స్ హాకీ టీం గెలుపు (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో కీలక మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. 4-3తో మ్యాచ్ గెలిచిన భారత జట్టు క్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

ఆట మొదలయ్యాక ఫస్ట్‌ హాఫ్‌ వరకు రెండు టీమ్‌లు పోటాపోటీగా గోల్స్ చేశాయి. మ్యాచ్‌లో తొలి గోల్‌తో శుభారంభం ఇచ్చిన వందన.. రెండు క్వార్టర్లలో రెండు గోల్స్‌ కొట్టింది. అయితే దక్షిణాఫ్రికా కూడా రెండు గోల్స్ చేయడంతో ఫస్ట్ హాఫ్‌ వరకు రెండు జట్లు 2-2తో సమంగా నిలిచాయి.

సెకండ్ హాఫ్‌లో నేహా గోల్ చేయగా.. అటు సౌతాఫ్రికా కూడా మరో గోల్ సాధించి స్కోర్ లెవల్ చేసింది. అయితే చివరిదైన నాలుగో క్వార్టర్‌లో దక్షిణాఫ్రికాకు ఆ అవకాశం ఇవ్వలేదు. వందన తన మూడో గోల్‌తో భారత జట్టుకు విజయం అందించింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story