ఇండియా వెస్టిండీస్ టీ20 సిరీస్: మ్యాచ్ గెలిచారు..సిరీస్ పట్టారు..

ఇండియా వెస్టిండీస్ టీ20 సిరీస్: మ్యాచ్ గెలిచారు..సిరీస్ పట్టారు..
x
Highlights

ఇటు బౌలర్లు.. అటు బ్యాట్స్ మెన్ ఇద్దరూ చెలరేగడంతో వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్ లో విజయం సాధించింది టీమిండియా. దీంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ ను...

ఇటు బౌలర్లు.. అటు బ్యాట్స్ మెన్ ఇద్దరూ చెలరేగడంతో వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్ లో విజయం సాధించింది టీమిండియా. దీంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ ను రెండు వరుస మ్యాచ్ లు గెలిచి తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో వెస్టిండీస్ భారత్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పెద్దగా కష్టపడకుండానే రెండో టి20 మ్యాచ్‌లో కోహ్లి సేన డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 22 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ కోహ్లి (23 బంతుల్లో 28; ఫోర్, సిక్స్‌), 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కృనాల్‌ పాండ్యా (13 బంతుల్లో 20 నాటౌట్‌; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. విండీస్‌ బౌలర్లలో థామస్‌ (2/27), కాట్రెల్‌ (2/25) రెండేసి వికెట్లు తీశారు. ఛేదనలో రావ్‌మన్‌ పావెల్‌ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మినహా విండీస్‌ తరఫున పెద్దగా ప్రతిఘటన లేకపోయింది. ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (1/12), పేసర్‌ భువనేశ్వర్‌ (1/7) ప్రత్యర్థిని మొదట్లోనే దెబ్బకొట్టారు. విజయానికి 27 బంతుల్లో 70 పరుగులు అవసరమైన దశలో విండీస్‌ 98/4తో ఉన్న స్థితిలో వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి వర్తింపజేయగా... విండీస్‌ ఇంకా 22 పరుగులు వెనుకబడి ఉన్నట్లు తేలింది. సిరీస్ లో మూడో టి20 మంగళవారం జరుగుతుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories